Kangana Ranaut Reacts on Mahesh Babu Bollywood can't afford me Statement: టాలీవుడ్ 'సూపర్ స్టార్' మహేష్ బాబు ఇటీవల 'సర్కారు వారి పాట' సినిమా ప్రచార కార్యకమాల్లో భాగంగా బాలీవుడ్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారాయి. బాలీవుడ్‌లో సినిమా ఎప్పుడు చేస్తారు అని అడగ్గా.. తనని బాలీవుడ్ భరించలేదని మహేష్ బాబు అన్నారు. సూపర్ స్టార్ వ్యాఖ్యలపై బాలీవుడ్‌లో పెద్ద దుమారమే రేగుతోంది. బాలీవుడ్ ప్రముఖులు కొందరు మహేష్ బాబు వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు. ఈ విషయంపై బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ స్పందించి.. బాబుకి మద్దతుగా నిలిచారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కంగనా రనౌత్ తన తాజాగా యాక్షన్ చిత్రం 'ధాకడ్' రెండవ టీజర్‌ను లాంచ్ చేయడానికి ఢిల్లీకి వెళ్లారు. ఈ కార్యక్రమంలో మహేష్ బాబు చేసిన వ్యాఖ్యలపై ఓ మీడియా కంగనా రనౌత్ అభిప్రాయం అడిగింది. 'మహేశ్‌ బాబు చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికీ నిజమే. ఆయన అన్నదానితో నేను ఏకీభవిస్తున్నాను. ఆయనను బాలీవుడ్‌ నిజంగానే భరించలేదు. బాలీవుడ్‌ నుంచి ఎంతోమంది దర్శకనిర్మాతలు ఆయనతో సినిమా చేయడం కోసం సంప్రదించారో నాకు తెలుసు. ప్రస్తుతం టాలీవుడ్‌ దేశంలోనే నెం1 ఇండస్ట్రీగా ఉంది. కాబట్టి ఆయనని బాలీవుడ్ భరించలేదు' అని అన్నారు. 


'మహేశ్‌ బాబు చేసిన కామెంట్స్‌ని ఎందుకు కాంట్రవర్సీ చేస్తున్నారో నాకు అసలు అర్థం కావట్లేదు. టాలీవుడ్‌పై, తన పనిపైనా మహేశ్‌  గౌరవం చూపడం వల్లే ఈ స్థాయిలో ఉన్నారు. దాన్ని మనందరం అంగీకరించాలి. టాలీవుడ్‌ను చూసి చాలా నేర్చుకోవాలి. హాలీవుడ్ మమ్మల్ని భరించదు అని ఇతరులు తరచుగా చమత్కరిస్తున్నారు. మరి వారిని అందుకు ఇలా అనడం లేదు' అని బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ ప్రశ్నించారు. కంగనా తరచుగా బాలీవుడ్ ప్రముఖుల్ని విమర్శించడం మనం చూస్తూనే ఉన్నాం. 


Also Read: Pat Cummins IPL: ఐపీఎల్‌ నుంచి కోల్‌కతా పేసర్ పాట్‌ కమిన్స్‌ ఔట్.. కారణం ఇదే!


Also Read: Ben Stokes Falls: క్రీజులోనే కుప్పకూలిన బెన్ స్టోక్స్.. తృటిలో తప్పిన పెను ప్రమాదం!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook