Sarkaru Vaari Paata Latest Updates: సూపర్ స్టార్ మహేష్ బాబు 'సర్కారు వారి పాట' ప్రీ రిలీజ్ బిజినెస్ గట్టిగానే జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియెట్రికల్ బిజినెస్ రూ.125 కోట్ల వరకు జరిగినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపు రూ.100 కోట్లు బిజినెస్ చేసినట్లు చెబుతున్నారు. సినిమా హిట్టు కొట్టాలంటే దాదాపు రూ.130 కోట్లకు పైగా వసూలు చేయాల్సి ఉంటుంది. బ్లాక్ బస్టర్‌గా నిలవాలంటే రూ.180 కోట్ల వరకు వసూలు చేయాల్సి ఉంటుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అత్యధికంగా నైజాంలో సర్కారు వారి పాట థియెట్రికల్ బిజినెస్ రూ.36 కోట్ల వరకు జరిగినట్లు తెలుస్తోంది. సీడెడ్‌లో రూ.13.5 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.13 కోట్లు, ఈస్ట్-వెస్ట్ రూ.15.5 కోట్లు, గుంటూరు రూ.9 కోట్లు, కృష్ణా రూ.7.5 కోట్లు, నెల్లూరు రూ.4 కోట్లు వరకు బిజినెస్ చేసినట్లు టాక్. ఇక రెస్టాఫ్ ఇండియాలో రూ.23.5 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.11 కోట్లు బిజినెస్ చేసినట్లు చెబుతున్నారు.


గతంలో మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' సినిమా థియెట్రికల్ బిజినెస్ తెలుగు రాష్ట్రాల్లో రూ.76 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.105 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. సరిలేరు నీకెవ్వరు తర్వాత రెండేళ్ల గ్యాప్‌తో వస్తున్న మహేష్ సర్కారు వారి పాట ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా అదరగొట్టిందనే చెప్పాలి. 


మహేష్-కీర్తి సురేష్ జంటగా పరశురామ్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబి ఎంటర్టైన్‌మెంట్ సంస్థలు సంయుక్త  నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది. సినిమాకు తమన్ సంగీతం అందించాడు. ఇప్పటికే విడుదలైన 'కళావతి', 'పెన్నీ', 'సర్కారు వారి పాట' సాంగ్స్ సూపర్ హిట్‌గా నిలిచాయి. ఇక ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ ఫ్యాన్స్‌లో జోష్ పెంచేసింది. ఎప్పుడెప్పుడు మహేష్ బాబును సిల్వర్ స్క్రీన్‌పై చూద్దామా అని ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 


Also Read:Horoscope Today May 9 2022: రాశి ఫలాలు..  ఆ రాశి వారు ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తారు...  


Also Read: Saroor Nagar Honour Killing: సరూర్ నగర్ పరువు హత్య... రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook