Mahesh Babu Mother Indira Devi Last Rites Update: సూపర్ స్టార్ కృష్ణ భార్య సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి అనారోగ్య కారణాలతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్స్ లో చికిత్స తీసుకుంటున్నారు. కొద్దిరోజులుగా ఆమెను వెంటిలేటర్ సపోర్ట్ పైనే ఉంచినట్లుగా తెలుస్తోంది. అయితే వైద్యులు ఎంత కృషిచేసినా ఆమె ఆరోగ్యాన్ని కాపాడ లేకపోవడంతో ఆమె ఈ ఉదయం సుమారు నాలుగు గంటల సమయంలో కన్ను ముసినట్లుగా మహేష్ బాబు కుటుంబ సభ్యులు మీడియాకు సమాచారం అందించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొన్నాళ్ల క్రితం విజయనిర్మల ఆ తర్వాత రమేష్ బాబు మృతితో మహేష్ బాబు కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఇప్పుడు మహేష్ బాబు ఎంతో ప్రేమించి అత్యంత గౌరవించే ఇందిరా దేవి కన్నుమూయడంతో ఒక్కసారిగా వారంతా తీవ్ర విషాదంలో కూరుకుపోయినట్లు అయింది. ఇక తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఉదయం 9 గంటల నుంచి ఆమె పార్థీవ దేహాన్ని సూపర్ స్టార్ కృష్ణకు చెందిన పద్మాలయ స్టూడియోస్ లో సందర్శకుల సందర్శనార్థం ఉంచబోతున్నట్లుగా తెలుస్తోంది.


సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు అలాగే ఘట్టమనేని కుటుంబం అభిమానులు ఆమెను అక్కడ కడసారి చూసుకునేందుకు అవకాశం కల్పించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఆమె అంత్యక్రియలను జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో చేసేందుకు కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. అయితే మహాప్రస్థానంలో అంత్యక్రియలు ఈరోజు జరుగుతాయా లేక రేపటికి  వాయిదా వేస్తారా అన్న విషయం మీద ప్రస్తుతానికైతే ఎలాంటి క్లారిటీ లేదు.


ఇక ఆమె మృతి నేపద్యంలో సినీ ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆ మాతృదేవత ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. సూపర్ స్టార్ కృష్ణ గారికి సోదరుడు మహేష్ బాబుకి వారి కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు. చిరంజీవి మాత్రమే కాకుండా మరికొందరు కూడా తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.


Also Read: Indira Devi Unseen Photos: మీరెన్నడూ చూడని మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి ఫోటోలు!


Also Read: Mahesh Babu Mother Indira Devi: మహేష్ బాబు ఇంట తీవ్ర విషాదం.. ఆ బాధ నుంచి బయటపడేలోపే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook