Sarkaru Vaari Paata: మహేశ్ బాబు అభిమానులకు గుడ్‌న్యూస్. ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సర్కారు వారి పాట సినిమా ట్రైలర్ విడుదల తేదీ ఖరారైంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సూపర్ స్టార్ మహేశ్ బాబు, కీర్తి సురేష్ నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాకు సంబంధించి కీలకమైన అప్‌డేట్ వెలువడింది. సినిమా హైప్‌ను పెంచే విధంగా రూపుదిద్దుకున్న ట్రైలర్‌ను మరో రెండ్రోజుల్లో విడుదల చేయనున్నారు. 


ఈనెల అంటే ఏప్రిల్ 28వ తేదీన సర్కారు వారిపాట ట్రైలర్ విడుదల కానుంది. అంటే సినిమా విడుదలకు రెండు వారాల ముందు. సర్కారు వారి పాట ప్రపంచవ్యాప్తంగా మే 12న విడుదల కానుంది.


సర్కారు వారి పాట సినిమా ప్రమోషన్లు లేకపోవడంతో వస్తున్న విమర్శలకు సమాధానంగా చిత్ర నిర్మాతలు ట్రైలర్‌ను చాలా ముందుగా రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా ట్రైలర్ అంతా ఫుల్ యాక్షన్‌తో కూడుకుని ఉన్నట్టు సమాచారం. తమన్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలు ఇప్పటికే వైరల్ అవుతున్నాయి. కళావతి పాటైతే రికార్డులు బద్దలుగొడుతోంది. సినిమా ఇప్పటికే మ్యూజికల్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో..సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.ఇప్పుడు ఏప్రిల్ 28న విడుదల కానున్న ట్రైలర్‌తో మరింతగా అంచనాలు పెరగనున్నాయి.


Also read: Jeevitha Rajasekhar Issue: ఎంతమంది నిర్మాతల్ని ట్రాప్ చేసి..డబ్బులు గుంజుకుందో.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.