Rajakumarudu Unseen Scene: తెలుగు సినిమా హీరోల్లో.. మహేష్ బాబుకి ప్రత్యేక స్థానం ఉంది. సినిమాల్లోకి అడుగు పెట్టింది సూపర్ స్టార్ కృష్ణ కొడుకు గానే అయినా.. తనకంటూ మంచి క్రేజ్ తెచ్చుకున్నారు ఈ హీరో. ఇతర ఇండస్ట్రీ వాళ్ళు సైతం.. మన మహేష్ ని చూసి హాలీవుడ్ కట్ అవుట్ అంటూ కామెంట్లు పెడుతుంటారు. త్వరలోనే రాజమౌళి సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో.. సెన్సేషన్ క్రియేట్ చేయడానికి సిద్ధమవుతున్నారు మన ప్రిన్స్. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక ఎన్నో సినిమాల్లో బాల నటుడిగా నటించిన మహేష్ బాబు.. హీరోగా చేసిన మొదటి సినిమా రాజకుమారుడు. ఈ సినిమా విడుదల ఈరోజుతో 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో ఈ సినిమా గురించి ఒక వార్త సోషల్ మీడియాలో తెగ ట్రెండ్.. అవుతోంది.


రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన రాజకుమారుడు సినిమా.. అప్పట్లో మంచి విజయం సాధించింది. ప్రీతి జింట హీరోయిన్ గా చేసిన ఈ చిత్రంలో.. ప్రకాష్ రాజ్,  సుమలత ముఖ్యపాత్రలో కనిపించారు. మొదటి సినిమాలోని.. తనదైన నటన, కామెడీ టైమింగ్, యాక్షన్ సీన్లతో అదరగొట్టాడు మన సూపర్ స్టార్. 


అంతేకాదు ఈ చిత్రం 45 సెంటర్స్ లో 100 రోజులు పూర్తి చేసుకుంది. అప్పట్లోనే ఈ చిత్రం రూ.10 కోట్లు వసూలు చేసింది. అయితే మహేష్ బాబుకు చిన్నప్పటి నుంచి.. దర్శకుడు రాఘవేంద్రరావుని మామయ్య అని పిలవడం అలవాటు అంట. అందుకే రాజకుమారుడు షూటింగ్ సమయంలో కూడా.. రాఘవేంద్రరావుని మామయ్య అనే మహేష్ బాబు పిలిచేవారట. 


కాగా ఈ సినిమా షూటింగ్ సమయంలో.. ఒక సీన్ లో ప్రీతిజింటాతో ముద్దు సన్నివేశం ప్లాన్ చేశారు. ఆ సీన్ లో భాగంగా కూల్ డ్రింక్ బాటిల్ తీసుకువచ్చి.. అందులో ఒక స్ట్రా వేసి.. హీరోయిన్ తాగిన తర్వాత ఆ స్ట్రాతోనే మహేష్ తాగాలని  రాఘవేంద్ర రావు చెప్పారట. కానీ మహేష్ బాబు మాత్రం దీనికి ఒప్పుకోలేదట. “నేను చేయను మావయ్య.. కావాలంటే నువ్వు చేసుకో” అంటూ ఆ సీన్ చెయ్యకుండా మహేష్.. అక్కడి నుంచి వెళ్లిపోయారట. ఇక ఈ విషయం గురించి ఒక ఇంటర్వ్యూలో రాఘవేంద్రరావు స్వయంగా చెప్పడం విశేషం. 


రాజకుమారుడు 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా.. రాఘవేంద్రరావు అప్పట్లో షేర్ చేసిన ఈ విషయం ఇప్పుడు వైరల్ అవుతోంది.


Also Read: Revanth vs Tollywood: నా మాటలకే స్పందన ఇవ్వరా? సినీ పరిశ్రమపై మళ్లీ రేవంత్‌ రెడ్డి అసంతృప్తి


Also Read: Telangana Assembly: అసెంబ్లీలో ఆసక్తికర చర్చ.. రేవంత్ రెడ్డి సీటుకు ఎసరు పెట్టిన కోమటిరెడ్డి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter