Mahesh Babu: సినిమా ఇండస్ట్రీ అంటెనే యాపారం. నిన్న మొన్నటి వరకు హీరోలకు కేవలం సంపాదన కోసం కేవలం సినిమాలు మాత్రమే ఉండేవి. ఇపుడు సీన్ మారింది. హీరో ఇమేజ్‌ను బట్టి వాళ్ల చుట్టూ పెద్ద పెద్ద కంపెనీలు తమ బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ కోసం ఎగబడుతున్నారు. ఇందులో మహేష్ బాబు రెండు ఆకులు ఎక్కువే చదివారు. ప్రస్తుతం తెలుగులో ఏ హీరోకు లేనన్ని బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ మహేష్ బాబు చేతిలో ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా ఫేన్ పేలో అమితాబ్ బచ్చన్ వాయిస్ మాత్రమే దేశం మొత్తం వినిబడేది. తాజాగా తెలుగు ప్రజల కోసం ఫోన్ పే మహేష్‌ బాబు వాయిస్ యూజ్ చేసుకుంటోంది. రెండు సెకన్ల మహేష్ బాబు వాయిస్ కోసం దాదాపు రూ. 5 కోట్ల వరకు రెమ్యునరేషన్ పండుగాడికి ఇచ్చినట్టు సమాచారం. ఈ యాడ్ ఎండార్సమెంట్ రెండేళ్ల పాటు ఉంటుందట. ఏది ఏమైనా మహేష్ బాబు వాయిస్‌తో ఫోన్ పే ఇపుడు ప్రజలకు మరింత చేరువ కానుంది.


మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే.. ఈ యేడాది సంక్రాంతి కానుకగా గుంటూరు కారం సినిమాతో పలకరించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అబౌ యావరేజ్‌గా నిలిచింది. ఈ మూవీ డివైడ్ టాక్‌తో దాదాపు బాక్సాఫీస్ దగ్గర 90 శాతం రికవరీ సాధించింది.  


ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ క్లోజింగ్ వసూళ్ల విషయానికొస్తే..ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా  రూ. 111 కోట్ల షేర్.. (రూ. 184.5 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టింది. గుంటూరు కారం  సినిమా థియేట్రికల్‌గా  రూ. 132 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రూ. 133 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్డర రూ.21.19 కోట్ల నష్టాలను తీసుకొచ్చింది. ఏది ఏమైనా నెగిటివ్ టాక్‌తో గుంటూరు కారం సినిమా ఈ రేంజ్ వసూళ్లను రాబట్టడం మాములు విషయం కాదు.


అటు గుంటూరు కారం సినిమా తర్వాత మహేష్ బాబు... రాజమౌళి సినిమా కోసం ట్రెయిన్ అవుతున్నాడు. అందుకోసం విదేశాలకు వెళ్లాడు. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వ్యవహారాలు ఓ కొలిక్కి వచ్చాయి. త్వరలో హాలీవుడ్ సహా భారత దేశంలోని దిగ్గజ సినీ అతిరథ మహారథులు సమక్షంలో ఈ సినిమా పూజా కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. ఈ సినిమా 2025 ద్వితీయార్ధంలో విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నాడు జక్కన్న. హీరోగా మహేష్ బాబుకు ఇదే తొలి ప్యాన్ ఇండియా కాదు కాదు.. ప్యాన్ వరల్డ్ మూవీ అని చెప్పాలి.


Also Read: Telangana: ముఖ్యమంత్రి అవుతాడని రేవంత్‌ రెడ్డి స్వగ్రామంలోనే ఎవరూ నమ్మలేదు: కేటీఆర్‌


Also Read: Delhi Liquor Scam: 'నాకు చాలా అనుమానాలున్నాయి.. విచారణకు రాలేను': సీబీఐకి కవిత లేఖ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి