Mahesh Babu Restaurant Business: దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనేది పెద్దలు చెప్పే సామెత. ఇప్పుడు దాదాపు ఆ సామెతను అందరూ ఫాలో అవుతున్నారు. క్రేజ్ ఉన్న సమయంలోనే ఆ క్రేజ్ వల్ల ఉపయోగం ఉండే పనులు చేయాలని కోరుకుంటున్నారు. మరీ ముఖ్యంగా సినిమా సెలబ్రిటీలు ఇప్పుడు కేవలం సినిమాల మీద దృష్టి పెట్టకుండా అనేక వ్యాపారాల మీద దృష్టి పెడుతున్న సంగతి తెలిసిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటికే చాలా మంది టాలీవుడ్ సెలబ్రిటీలు బట్టలు బిజినెస్ లు చేస్తున్నారు, హోటల్ బిజినెస్ లు చేస్తున్నారు, థియేటర్లు పెడుతున్నారు, అలాగే కొన్ని షాపింగ్ మాల్స్ మీద కూడా పెట్టుబడులు పెడుతున్నారు. ఇప్పటికే మహేష్ బాబు ఏఎంబీ థియేటర్స్లో వాటాలు పెట్టిన సంగతి తెలిసిందే. అలాగే నిర్మాతగా కూడా ఆయన సినిమాల నిర్మిస్తున్నారు. తాజాగా ఆయన మరో బిజినెస్ లో కూడా ఎంటర్ అవబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.


సూపర్ స్టార్ మహేష్ బాబు మినర్వా గ్రూప్ తో కలిసి ఒక రెస్టారెంట్ ప్రారంభించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. హైదరాబాదులోని పాష్ ఏరియాగా పేరు ఉన్న బంజారాహిల్స్ లో ఈ రెస్టారెంట్ ఓపెన్ చేయబోతున్నారని ప్రచారం జరుగుతోంది. నిజానికి ఇప్పటికే మన టాలీవుడ్ సెలబ్రిటీలకు చాలామందికి హోటల్ బిజినెస్ లు ఉన్నాయి. అల్లు అర్జున్, నవదీప్, శర్వానంద్, సందీప్ కిషన్, దర్శకుడు సురేందర్ రెడ్డి, రాజమౌళి కుమారుడు కార్తికేయ, మంచు లక్ష్మి వంటి వాళ్లు పలు పేర్లతో రెస్టారెంట్లు నడుపుతున్నారు.


ఇప్పుడు అదే బాటలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా నడవబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో నిజా నిజాలు ఏ మేరకు ఉన్నాయి అనేది ఆయన రెస్టారెంట్ ప్రారంభిస్తే కానీ ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడటం లేదు. ఇక మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే ఇప్పుడు త్రివిక్రమ్ తో సినిమా చేయాల్సి ఉంది. ఆగస్టు నెలలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది అంటూ సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించబోతోంది. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది. ఆ సినిమాకు కేఎల్ నారాయణ నిర్మాతగా వ్యవహరించబోతున్నారు.


Also Read: Sarath Chandran: పరిశ్రమలో తీవ్ర విషాదం.. యువ నటుడు ఆకస్మిక మృతి!


Also Read: Nandamuri Fan Death: అలా జరగడంతోనే సాయిరామ్ మృతి.. అండగా నిలబడతామంటూ ఎన్టీఆర్ ఆర్ట్స్ ప్రకటన!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook