Guntur kaaram Movie Update: సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu)-టాలీవుడ్ టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా గుంటూరు కారం(Guntur kaaram). ఈ మూవీ మెుదలైనప్పటి నుంచి ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది. ఈ సినిమా నుంచి  మెుదట పూజాహెగ్డే బయటకు వచ్చేసింది. ఆ తర్వాత డీవోపీ పీఎస్ వినోద్‌ తప్పుకున్నారు. అతడి స్థానంలో మనోజ్ పరమహంస వచ్చినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ చిత్రం నుంచి ఫైట్ మాస్టర్లు రామ్-లక్ష్మణ్ తప్పుకున్నారని టాక్ వినిపిస్తోంది. దీనిపై మేకర్స్ క్లారిటీ ఇవాల్సి ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొన్నాళ్లుపాటు ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. తాజాగా ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఆగస్టు 16వ తేదీ నుంచి ఈ మూవీ కొత్త షెడ్యూల్ ప్రారంభించాలని చిత్రయూనిట్ ఫ్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం మహేష్ కుటుంబంతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు. త్వరలోనే మహేశ్ ఇండియాకు రానున్నారని.. షూటింగ్ లో రీజాయిన్ అవ్వనున్నారని తెలుస్తోంది. అంతేకాకుండా ఈ మూవీ కొత్త షెడ్యూల్ కోసం రూ.4 కోట్లు ఖర్చు పెట్టి కొత్త సెట్ వేయబోతున్నారట. ఇప్పుడు ఇది టాలీవుడ్ లో హాట్ టాఫిక్ గా మారింది. 


Also Read: Gadar 2 Collections: రూ. 150 కోట్లకు చేరువలో 'గదర్ 2'.. మూడో రోజు ఎంత వసూలు చేసిందంటే?


ఎస్‌ఎస్‌ఎంబీ 28 (SSMB 28)గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఈ మూవీని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి తమన్ సంగీతం అందించనున్నారు.  ఇప్పటికే రిలీజైన పోస్టర్లు సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుక విడుదల చేయనున్నారు. 


Also Read: Saindhav Movie: థ్రిల్లర్‌ ప్రియులకు గుడ్ న్యూస్.. వెంకటేష్ 'సైంధవ్‌' నుంచి క్రేజీ అప్‌డేట్‌ వచ్చేసింది..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook