Mahesh Babu's Movie with Trivikram to release on 28 April 2023: ఇప్పటికే తెలుగు సినీ పరిశ్రమ నుంచి విడుదల కావాల్సిన పెద్ద సినిమాలు అన్ని విడుదలైపోయాయి. చిన్న సినిమాలు విడుదల కావడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. అయితే ఇంకా సినిమాలు సెట్స్ మీదకు కూడా వెళ్లకుండానే అప్పుడే కర్చీఫ్ లు వేసేసుకుంటున్నారు దర్శక నిర్మాతలు. ఈ ఏడాదిలో మళ్ళీ పెద్ద సినిమాలు రావడం అనేది దాదాపు అసాధ్యం అని చెప్పాలి మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఒకటి రెండు సినిమాలు విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అలాగే బాలకృష్ణ 107వ సినిమా లాంటి సినిమాలు విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.  కానీ ప్రభాస్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి వారు చేస్తున్న సినిమాలు ఈ ఏడాది విడుదల అయ్యే అవకాశాలు లేవు. వచ్చే ఏడాది సంక్రాంతి మొదలు సినిమాలు మళ్ళీ రిలీజ్ డేట్స్ కోసం ఇబ్బంది పడే అవకాశం ఉంది. అందుకే వచ్చే ఏడాది విడుదల చేసుకునే ఈ సినిమాలకు అప్పుడే కర్చీఫ్ లు వేసేస్తున్నారు దర్శకనిర్మాతలు. అసలు విషయం ఏమిటంటే వచ్చేడాది మార్చి నెల 30వ తేదీ రిలీజ్ కి అనువైన తేదీగా భావిస్తున్నారు.


ఎందుకంటే ఆ రోజు కనుక విడుదల చేస్తే అప్పటినుంచి 11 రోజుల్లో 7 సెలవులు వస్తున్నాయి. అలాగే ఆ తర్వాత వారం అంటే ఏప్రిల్ ఏడవ తేదీ కూడా విడుదలకు అనువైన రోజుగా భావిస్తున్నారు. ఎందుకంటే ఆ తర్వాత పది రోజుల్లో మరో ఆరు రోజులు సెలవులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే రెండు వారాల తర్వాత అంటే ఏప్రిల్  21వ తేదీ కూడా సినిమాల విడుదలకు అనువైన తేదీ అంటున్నారు.


ఆ తర్వాత 11 రోజులకు గాను ఐదు రోజులు సెలవు దినాలు వస్తూ ఉండడంతో ఈ మూడు రోజుల్లో సినిమాలు విడుదల చేస్తే బాగుంటుందనే అంచనాలు వెలువడుతున్నాయి. అయితే ఈ విషయంలో కాస్త ముందుగానే మేల్కొన్న హారిక హాసిని క్రియేషన్స్ సంస్థ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 28న విడుదల చేయబోతున్నామని ప్రకటించారు. వరుస సెలవులు ఉన్నా ఆ డేట్ల మీద కన్నేయకుండా ఎందుకో ఏప్రిల్ 28న రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. బహుశా ఈ సెలవుల మీద దృష్ఠి పడితే ఆ రిలీజ్ డేట్ ముందుకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. 


Also Read: LIGER Pre Release Event: లైగర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడే.. ఎప్పుడంటే?


Also Read: Liger Movie Censor Report: లైగర్ మూవీ సెన్సార్ రిపోర్ట్.. ఆ బూతు డైలాగ్స్, సైగలకు సెన్సార్ కట్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి