Mahesh Babu Shilpa Shirodkar: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. ప్రపంచ దేశాలను గడగడలాడిస్తుంది. ఈ నేపథ్యంలో అనేక దేశాల్లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్న కారణంగా ఆంక్షల్లోకి జారుకుంటున్నాయి. గురువారం దేశంలో కరోనా కేసులు పెరిగాయి. బుధవారం ఒక్కరోజు 13 వేలకు పైగా కొత్త కరోనా కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా కేసులు మరోసారి పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో భయాందోళనలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే అటు బాలీవుడ్ తో పాటు దక్షిణాది చిత్ర పరిశ్రమలోని కొందరు ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లో కరోనా కలకలం సృష్టిస్తోంది. 


టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వదిన, నమ్రత అక్క అయినా శిల్పా శిరోద్కర్ కరోనా బారిన పడ్డారు. శిల్పా కూడా ఒకనాటి బాలీవుడ్ హీరోయిన్. 'హమ్', 'ఖుదా గవా', 'ఆంఖేన్' వంటి సినిమాలలో హీరోయిన్ గా నటించిన శిల్పా ప్రస్తుతం దుబాయ్ లో నివసిస్తున్నారు.


మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ తో శిల్పకు ఎంతటి అనుబంధం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నమ్రత- మహేష్ ఈ పార్టీ చేసుకున్నా శిల్పా లేకుండా ఉండదు. ఇక గత నాలుగురోజుల నుంచి ఆమె కరోనాతో పోరాటం చేస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. 



"ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండండి, దయచేసి టీకాలు వేసుకోండి. కరోనా వైరస్ నియంత్రణకు అన్ని నియమాలను అనుసరించండి" అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఈ పోస్ట్ కి నమ్రతా స్పందిస్తూ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అని కామెంట్ పెట్టింది.  


Also Read: Dakko Dakko Meka Video Song: 'పుష్ప' నుంచి బన్నీ ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్.. 'దాక్కో దాక్కో మేక' వీడియో సాంగ్ వచ్చేసింది!


Also Read: Krithi Shetty on Liplock: 'కథ డిమాండ్ చేస్తే ఏం చేయడానికైనా సిద్ధమే'.. కృతి శెట్టి షాకింగ్ కామెంట్స్!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి