Mahesh Babu - Rajamouli:  సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సంక్రాంతికి  'గుంటూరు కారం' సినిమాతో పలకరించారు. ఈ మూవీ బ్యాడ్ టాక్ తో కూడా మంచి వసూళ్లనే రాబట్టింది. మొద‌టి రోజు మహేష్ బాబు ఇమేజ్‌తో పాటు త్రివిక్రమ్ స్టార్ డమ్ వంటివి ఈ చిత్రానికి బాగానే కలిసొచ్చి సాలిడ్ వసూళ్లను రాబట్టింది.అంతేకాదు రూ. 90 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో నాన్ ప్యాన్ ఇండియా క్యాటగిరిలో హైయ్యెస్ట్ ఫస్ట్ డే వసూళ్లను సాధించిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది. మొత్తంగా బాక్సాఫీస్ దగ్గర హనుమాన్ సినిమా దూకుడును  సైతం తట్టుకుంటూ ఓన్లీ మహేష్ బాబు ఇమేజ్ కారణంగా  ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే రాబట్టింది.మరోవైపు ఈ సినిమాకు ఈ ఫలితం రావడంపై అందరు గురూజీ వైపు వేలెత్తి చూపెడుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మొత్తంగా మహేష్ బాబు ఇమేజ కారణంగా ఈ మూవీ 90 శాతం రికవరీ అయింది. ఈ మూవీలో మహేష్ బాబును కొత్తగా చూపించడంతో పాటు డాన్సులు అభిమానులను అలరించాయి. ఈ మూవీ తర్వాత మహేష్ బాబు రాజమౌళి సినిమా చేయనున్నాడు. ఈ సినిమా కోసం సూపర్ స్టార్ ప్రత్యేకంగా ట్రెయిన్ కానున్నాడు.  ఇక రాజ‌మౌళి, మ‌హేష్ బాబు సినిమా ఉగాది కానుక‌గా పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభించినున్నారు. దీనికి సంబంధించిన అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న వెలుబ‌డాల్సి ఉంది.


మ‌రోవైపు అప్ప‌టి నుంచి ప్రీ ప్రొడ‌క్ష‌న్ స్టార్ట్ చేసిన మ‌హేష్ బాబు పుట్టిన‌రోజైన ఆగ‌ష్టు 9న రెగ్యుల‌ర్ షూటింగ్ స్టార్ట్ చేయాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నారు. ఈ సినిమా కోసం హాలీవుడ్, బాలీవుడ్‌కు చెందిన అతిర‌థ మ‌హార‌థులు హాజ‌రు కానున్న‌ట్టు స‌మాచారం. ఇక రాజ‌మౌళి సినిమా కోసం మ‌హేష్ బాబు కొత్త లుక్‌లో మేకోవ‌ర్ కానున్నాడు. అందుకే ఈ సినిమా పూర్త‌య్యే వ‌ర‌కు మ‌హేష్ బాబు ఎక్క‌డా క‌న‌బ‌డ‌కుండా ఉండాల‌ని జ‌క్క‌న్న కండిష‌న్ పెట్టాడ‌ట‌. ఈ లోపు మ‌హేష్ బాబు త‌న చేతిలో ఉన్న కొన్ని బాండ్ ఎండార్స్‌మెంట్స్ షూటింగ్ చేయ‌నున్నాడు. ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జున కూడా ఓ ముఖ్య‌పాత్ర‌లో న‌టించ‌బోతున్న‌ట్టు స‌మాచారం. ముందుగా ఈ పాత్ర కోసం విక్ర‌మ్ లేదా బాల‌య్యల‌ను అనుకున్నారు. ఫైన‌ల్‌గా నాగార్జున న‌టించ‌బోతున్న‌ట్టు స‌మాచారం.  


యాక్ష‌న్ అడ్వంచ‌ర‌స్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో  స్టంట్స్ యాక్షన్ సీన్స్ కు ప్రాముఖ్య‌త ఉన్నాయి. దీని కోసం మహేష్ బాబు జర్మనీ వెళ్లాడు. అక్కడ ప్రముఖ వ్యాయామ నిపుణులు హ్యారీ కొనిగ్‌తో కలిసి ట్రెక్కింగ్‌తో పాటు ప‌లు వ్యాయామాలు చేస్తున్నాడు. అక్క‌డే ఈ సినిమాకు సంబంధించిన‌ కొన్ని యాక్షన్స్ సీన్స్ లో ట్రెయిన్ అవుతున్నాడు.


మ‌హేష్ బాబు, రాజ‌మౌళి సినిమాను  డాక్టర్ కే.ఎల్. నారాయణ భారీ ఎత్తున నిర్మించనున్నాడు. విజయేంద్ర ప్రసాద్ కథను అందిస్తున్నారు. ఈ సినిమా ఇండియానా జోన్స్ ఆధారంగా యాక్షన్ అండ్ అడ్వెంచరెస్ మూవీగా తెరకెక్కించనున్నాడు. ఈ మూవీని 2025 ఎండింగ్‌లో కానీ.. 2026 సంక్రాంతి కానుక‌గా విడుద‌ల చేయాల‌నే ప్లాన్‌లో ఉన్నాడు.


Also Read: Kuppam: చంద్రబాబును ఓడించండి.. కుప్పం అభివృద్ధి చేసుకుందాం: సీఎం జగన్‌ పిలుపు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి