Shaitan Web Series 2023: ఒకప్పుడు వెబ్ సిరీస్లు హిందీలో రూపొందించబడి వాటిని తెలుగులో డబ్ చేస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు నేరుగా తెలుగులో వెబ్ కంటెంట్ చేస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇక ఈ మధ్యకాలంలో ఓటిటి కంటెంట్ క్రియేట్ చేయడంలో డైరెక్టర్ మహీ వి రాఘవ్ ముందుంటున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటికే ఆయన సేవ్ ది టైగర్స్ అనే పేరుతో ఒక వెబ్ సిరీస్ రూపొందించగా దానికి మంచి టాక్ వచ్చింది. ఇక తాజాగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కోసమే మరొక వెబ్ సిరీస్ కూడా ఆయన సిద్ధం చేశారు. సైతాన్ అనే ఒక వెబ్ సిరీస్ ని ఆయన సిద్ధం చేస్తున్నారు. ఇక ఈ వెబ్ సిరీస్ లో సాయి కామాక్షి భాస్కర్ల మెయిన్ లీడ్ రోల్ లో నటించగా ఈ సిరీస్ కి సంబంధించిన ట్రైలర్ తాజాగా రిలీజ్ అయింది.


Also Read: Rakul Preet Singh: మాల్దీవుల్లో మంటలు రేపుతున్న రకుల్ ప్రీత్‌సింగ్.. హాట్ ట్రీట్ అంతకుమించి..! 


ఈ ట్రైలర్ అయితే చూసిన తర్వాత అందరూ అవాక్కవుతున్నారు. ఎందుకంటే ట్రైలర్ మొత్తం బూతు డైలాగులతో పాటు హింసాత్మక సీన్లతోనే నిండిపోయింది. నిజానికి ఇప్పటివరకు పాఠశాల, యాత్ర వంటి సినిమాలు చేసి సేవ్ ది టైగర్స్ పేరుతో ప్యూర్ కామెడీ పండించిన మహి రాఘవ్ తన శైలికి పూర్తి భిన్నంగా పూర్తి స్థాయిలో రా అండ్ రస్టిక్ సైతాన్ సిరీస్ తెరకెక్కించినట్లు సిరీస్ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.



తమ లక్ష్యం కోసం ఎంతమందినైనా చంపడానికి వెనకాడని క్రూరమైన మనస్తత్వం ఉన్న వ్యక్తులుగా ప్రధాన పాత్రధారులను చూపిస్తున్నారు రాఘవ్. ఇక ఈ బూతు డైలాగ్స్ ఐతే దారుణంగా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో రానా నాయుడు వెబ్ సిరీస్ వచ్చినప్పుడే ఏంట్రా బాబు ఇలా బూతులు మాట్లాడారు అనుకుంటే దానెమ్మ మొగుడు లాగా ఈ సిరీస్ అయితే ఉంది.


సిరీస్ మొత్తాన్ని పూర్తి స్థాయిలో బూతు కంటెంట్తో నింపేసినట్లుగా అర్థమవుతుంది. తనకు అన్యాయం చేసిన వారిపై బాలి అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి ఎలా పగ తీర్చుకున్నాడు అనేది ఈ వెబ్ సిరీస్ గా చెబుతున్నారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో జూన్ 15వ తేదీ నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతున్నట్లుగా తెలుస్తోంది. మొత్తం మీద ఈ బూతులు విన్న వారందరూ భీభత్సంగా వెబ్ సిరీస్ టీంను ట్రోల్ చేస్తున్నారు. చూడాలి మరి భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనేది.


Also Read: Prabhas Adipurush: ఆదిపురుష్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గ్రాండ్‌గా ఏర్పాట్లు..‌ చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి