‘తనాజీ’తో సక్సెస్ సాధించిన బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ మరో కీలక ప్రాజెక్టుతో బిజీగా ఉన్నాడు. ఫుట్ బాల్ నేపథ్యంలో అమిత్‌ రవీంద్రనాథ్‌ శర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘మైదాన్’. ఫస్ట్ లుక్ పోస్టర్‌తో సినిమాపై అంచనాలు పెరిగాయి. ప్రమోషన్లలో భాగంగా అజయ్ దేవగణ్ లుక్ గురువారం రివీల్ చేశారు. అజయ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో మైదాన్‌లో తన లుక్ పోస్టర్‌ను అభిమానులతో షేర్ చేసుకున్నాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: బెడ్‌పై తన కమిట్మెంట్ చూపిస్తోన్న నటి.. మామూలు లేదుగా!


భారత ఫుట్‌బాల్‌ గోల్డెన్ డేస్‌ ఎంజాయ్ చేస్తున్న సమయంలో ఉన్న కోచ్‌ సయ్యద్‌ అబ్దుల్‌ రహీమ్‌ జీవితం ఆధారంగా సినిమా తెరకెక్కుతోంది. భారత ఫుట్‌బాల్‌ గోల్డెన్ ఫేజ్‌లో ఉన్నప్పటి కథ, సక్సెస్ ఫుల్ కెప్టెన్ కథ కూడా అని అజయ్ దేవగణ్ పోస్టు క్యాప్షన్ రాసుకొచ్చాడు. ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఫుట్‌బాల్‌గా అబ్దుల్ రహీమ్ ప్రసిద్ధి. ఆయన పాత్రను అజయ్ దేవగణ్ పోషిస్తున్న విషయం తెలిసిందే. 1950 నుంచి 1963 వరకు (చనిపోయే వరకు) భారత ఫుట్ బాట్ జట్టుకు కోచ్, మేనేజర్‌గా సేవలందించారు సయ్యద్ అబ్దుల్ రహీమ్.



Also Read: న్యూడ్ వీడియోలతో వేధిస్తున్నారు!: నటి ఆవేదన


అబ్దుల్ రహీమ్ పాత్రకు అజయ్ పర్ఫెక్ట్‌గా సెట్ అయినట్లు కనిపిస్తున్నాడు. చేతిలో బ్యాగు, గొడుగు పట్టుకుని.. ఫుట్‌బాల్‌ కిక్ ఇస్తున్న అజయ్ దేవగణ్ లుక్ ఫ్యాన్స్‌కు మరింత కిక్ ఇచ్చింది. మార్పు తీసుకురావాలంటే ఒకరు నవంబర్ 27న విడుదల చేయబోతున్నట్లు తేదీని తెలుపుతూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను అజయ్ దేవగణ్ ట్వీట్ చేశాడు. అజయ్ దేవగణ్ భార్య పాత్రలో ప్రియమణి కనిపించనుంది. జీ స్టూడియోస్‌, బోని కపూర్‌, ఆకాష్ చావ్లా, అరునవ జాయ్ సెంగుప్త నిర్మాతలుగా వ్యహరిస్తున్నారు. 


Also Read: మతంపై షారుక్ ఆసక్తికర వ్యాఖ్యలు.. నెటిజన్లు ఫిదా



జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..