Maidaan Fnl Trailer Talk: రీసెంట్‌గా అజ‌య్ దేవ్‌గ‌ణ్ హీరోగా మాధ‌వ‌న్ మ‌రో ముఖ్య‌పాత్ర‌లో న‌టించిన షైతాన్ మూవీతో బంప‌ర్ హిట్ అందుకున్నారు.  ఈ మూవీ స‌క్సెస్‌ను ఎంజాయ్ చేస్తూనే ఇపుడు మ‌రో మూవీ  మైదాన్ మూవీతో ఆడియ‌న్స్ ముందుకు వ‌చ్చారు. కెరీర్ స్టార్ట్ చేసిన‌ప్ప‌టి నుంచి యేడాదికి క‌నీసం ఒక్క హిట్ లేకుండా ఆయ‌న కెరీర్ ముందుకు సాగ‌లేదు. ఈయ‌న తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా ప‌రిచ‌య‌మే. ఈయ‌న రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీతో టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌య్యారు. ఇందులో అల్లూరు  వెంక‌ట‌రామరాజుగా రామ్  చ‌ర‌ణ్ తండ్రి పాత్ర‌లో న‌టించారు. తాజాగా ఈయ‌న మ‌న దేశానికి సంబంధించిన భార‌త ఫుట్‌బాల్ లెజండ‌రీ కోచ్ స‌య్య‌ద్ అబ్దుల్ ర‌హీమ్ జీవిత క‌థ‌పై ఈ సినిమాను తెర‌కెక్కింది. ఈరోజు అజ‌య్ దేవ్‌గ‌ణ్ పుట్టిన‌రోజు సంద‌ర్బంగా ఈ మూవీ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫుట్‌బాల్ రంగంలో మ‌న భార‌త‌ టీమ్... చ‌రిత్ర‌ను ఎలా తిరగ‌రాసిందో చెప్పే చిత్ర‌మే మైదాన్‌. పుట్ బాల్ లో మ‌న దేశం స‌త్తా చాటాల‌ని త‌ప‌న ప‌డే ఓ లెజండ‌రీ కోచ్ క‌థ‌ను ఎంతో హృద్యంగా తెర‌పై ఆవిష్క‌రించారు. ప్ర‌తి ఒక్క‌రిలో అకింత భావం, అంచంచ‌ల‌మైన విశ్వాసంతో భార‌త దేశాన్ని ఫుట్ బాల్ రంగంలో ఎలా ముందుకు నిలిపాడ‌న్నది ఈ ఈ సినిమాలో చూపించారు.




అమిత్ ర‌వీంద్ర‌నాథ్ శ‌ర్మ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఆద‌ర్శ‌వంత‌మైన ఈ స్పోర్ట్స్ బ‌యోపిక్ మూవీలో అజ‌య్ దేవగ‌ణ్ స‌ర‌స‌న  ప్రియ‌మ‌ణి న‌టించారు. ఇత‌ర ముఖ్య‌పాత్ర‌ల్లో  గ‌జ్‌రాయ్ రావు, బెంగాలీ యాక్ట‌ర్ రుద్ర‌నీల్ ఘోష్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.
జీ స్టూడియోస్‌, బోనీ క‌పూర్‌, అరుణ‌వ జోయ్ సేన్‌గుప్తా, ఆకాష్ చావ్లా ఈ సినిమాను నిర్మించారు. సైవిన్ ఖుద్రాస్, రితీష్ షా స్క్రీన్ ప్లే, డైలాగులు రాశారు. ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీతాన్ని అందించారు.  మ‌నోజ్ శుక్లా పాట‌లు రాశారు. రంజాన్, ఉగాది పండ‌గ‌ల‌ను పుర‌స్క‌రించుకుని ఈ సినిమాను  ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఏప్రిల్ 10న విడుద‌ల చేస్తున్నారు. ఐమ్యాక్స్ వెర్ష‌న్ కూడా అదే రోజున విడుద‌ల కానుంది.


Also Read: KTR Vs Kishan Reddy: గాలికి గెలిచిన కిషన్‌ రెడ్డికి ఈసారి ఓటమే.. ఇదే నా ఛాలెంజ్‌: కేటీఆర్‌



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook