Malaika Arora Accident: బాలీవుడ్ నటి మలైకా అరోరా రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఓ ఫ్యాషన్ ఈవెంట్ లో పాల్గొనేందుకు శనివారం పుణెకు వెళ్లిన ఆమె.. ముంబయి తిరుగు ప్రయాణంలో మలైకా అరోరా ప్రయాణిస్తున్న కారు ప్రమాధానికి గురైంది. ఈ యాక్సిడెంట్ లో నటి మలైకా కంటికి తీవ్రంగా గాయమైంది. వెంటనే ఆమెను నవీ ముంబయిలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కంటికి గాయమైన కారణంగా ఆమెను ఆస్పత్రిలో చేర్చగా.. అయితే ఆమె ఆరోగ్యం ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని మలైకా సోదరి అమృతా అరోరా మీడియాకు తెలిపింది. ముంబయి - పుణె ఎక్స్ ప్రెస్ హైవేపై వరుసగా మూడు కార్లు ఒకదాని తర్వాత మరొకటి ఢీకొన్ని ఘటనలో మలైకా అరోరాకు గాయమైనట్లు తెలుస్తోంది. 



"ప్రస్తుతం మలైకా అరోరా ఆరోగ్యం నిలకడగానే ఉంది. తలకు గాయం కావడం వల్ల ఆమెను వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. ఆదివారం సాయంత్రం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది" అని అమృతా అరోరా మీడియాకు వెల్లడించారు. ఈ ప్రమాదంపై కోపోలి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.  


Also Read: Malaika Arora, Arjun Kapoor: 50 ఏళ్ల హీరోయిన్‌తో ఎఫైర్‌పై స్పందించిన యంగ్ హీరో


Also Read: Beast Movie Trailer: విజయ్ దళపతి 'బీస్ట్' మూవీ ట్రైలర్ వచ్చేసింది!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook