Malavika Mohanan Christy Trailer ఏ మాయ చేశావే సినిమాలో కార్తిక్ కంటే జెస్సీ పెద్దది. అయితే ఇప్పుడు క్రిస్టీ అనే సినిమాలో కూడా దాదాపుగా అదే లైన్. కాకపోతే హీరోయిన్‌ కంటే హీరో చాలా చాలా చిన్నవాడిలా అనిపిస్తున్నాడు. అక్కా అని పిలుస్తూనే ప్రపోజ్ చేసినట్టుగా అనిపిస్తోంది. ఇక ఇందులో చూపించిన సీన్లు, తెరకెక్కించిన తీరు, మాళవిక కనిపించిన విధానం, కేరళ అందాలను మరోసారి ఫ్రెష్‌గా చూపించడంతో క్రిస్టీ ట్రైలర్ గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

క్రిస్టీ ట్రైలర్‌కు విపరీతమైన స్పందన రావడంతో మాళవిక సైతం ఫుల్ ఖుషీ అవుతోంది. ఈ క్రమంలోనే మాళవిక #ASKMalavika అంటూ ట్విట్టర్‌లో ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ అయింది. ఈ క్రమంలో మాళవికను నెటిజన్లు రకరకాల ప్రశ్నలు వేశారు. క్రిస్టీ ట్రైలర్ గురించి అడిగారు. ప్రతీ ఫ్రేమ్ అద్భుతంగా ఉందని, ఎంతో అందంగా కనిపిస్తున్నావ్ అంటూ ఇలా ప్రశంసలు కురిపించేశారు. 


 




మహేష్‌ బాబుతో కలిసి నటిస్తావా?.. ఆయన గురించి ఏమైనా చెప్పండి అంటూ అడిగాడు ఓ నెటిజన్. ఆయన్ను మహర్షి సినిమా సెట్‌లో మా డాడీతో కలిసి చూశాను.. చాలా మంచి వారు.. ఆయనతో త్వరలోనే కచ్చితంగా నటిస్తాను అని చెప్పుకొచ్చింది. క్రిస్టీ కథ విన్న వెంటనే నాకు ఎంతో ఎగ్జైటింగ్‌గా అనిపించింది.. అందుకే వెంటనే ఓకే చెప్పాను అంటూ తెలిపింది మాళవిక.


ఆన్ స్క్రీన్ పెయిర్‌లో ఎవరంటే ఇష్టమని ఇంకో నెటిజన్ అడిగారు. దీనికి మాళవిక మంచి సమాధానం ఇచ్చింది. రీల్ కపుల్స్ రియల్ కపుల్స్ అయితే తనకు ఎంతో ఇష్టమని.. సూర్య జ్యోతికల పెయిర్ అంటే చాలా ఇష్టమని, వారి జోడి ఎంతో చూడముచ్చటగా ఉంటుంది కదూ అంటూ మాళవిక చెప్పుకొచ్చింది.


నయనతార, మాళవిక మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. తనకు లేడీ సూపర్ స్టార్ అనే ట్యాగులు నచ్చవని, ఉంటే సూపర్ స్టార్స్ ఉంటారు.. మళ్లీ ప్రత్యేకంగా లేడీ అని ట్యాగ్ చేయడం నాకు నచ్చదంటూ మాళవిక చెప్పుకొచ్చింది.


Also Read:  Sreeleela Latest Photos : శ్రీలీల.. పెడుతోంది గుండెల్లో గోల.. చూస్తే తట్టుకోలేరంతే


Also Read: SSMB 28 Look : మహేష్‌ బాబు లెటెస్ట్ లుక్.. మరింత తగ్గిపోయాడే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook