Casting Couch: క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు మరోసారి విన్పిస్తున్నాయి. మలయాళ నటుడు , నిర్మాత విజయ్ బాబుపై లైంగిక వేధింపులకు తోడు క్యాస్టింగ్ కౌచ్ వచ్చి చేరింది. ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మలయాళ నటుడు, నిర్మాత విజయ్ బాబుపై మరోసారి లైంగిక వేధింపుల కేసు నమోదైంది. విమెన్ ఎగైనెస్ట్ సెక్సువల్ హెరాస్‌మెంట్ ఫేస్‌బుక్ పేజిలో ఓ మహిళ పంచుకున్న అనుభవంతో విజయ్ బాబు వ్యవహారం కాస్తా బయటపడింది. సినీ పరిశ్రమలో అడుగుపెట్టాలనే తన కలను ఎలా చెదరగొట్టాడో వివరించింది.


ఇది జరిగింది 2021 నవంబర్ నెలల. ఆరోజు విజయ్ బాబును కలిసి వృత్తిపరమైన విషయాలపై మాట్లాడాను. వ్యక్తిగత అంశాలు కూడా చర్చకొచ్చాయి. నా బాధలు నేను చెప్పుకున్నాను. సహాయం చేస్తానన్నాడు. మా ఇద్దరితోపాటు ఉన్న మరో వ్యక్తి బయటకు వెళ్లిపోయాడు. విజయ్ బాబు మద్యం సేవిస్తూ నాతో మాట్లాడుతున్నాడు. నాకు ఆఫర్ చేస్తే..వద్దన్నాను. మాట్లాడుతుండగానే..ఒక్కసారిగా నా పెదాలపై ముద్దు పెట్టేందుకు ప్రయత్నించాడు. నేను అప్రమత్తమై..దూరం జరిగిపోయాను. జస్ట్ వన్ కిస్ అన్నాడు. నేను కుదరదని చెప్పడంతో సారీ చెప్పి..ఎవరికీ ఈ విషయాన్ని చెప్పొద్దన్నాడు. నేను కూడా ఏదో కారణం చెప్పి బయటికొచ్చేశాను. అయితే ఆ తరువాత అతడి వైఖరి నన్ను పరిశ్రమలో రానివ్వలేదు. సినీ పరిశ్రమలో అడుగు పెట్టాలనే నా కల అక్కడితో ఆగిపోయింది. ఈ మధ్యన ఓ నటి తనకెదురైన చేదు అనుభవాన్ని బయటపెట్టినప్పుడు నాక్కూడా ఈ విషయాన్ని చెప్పాలన్పించింది. అంటూ ఆ మహిళ రాసుకొచ్చింది. ఈ పోస్టు ప్రస్తుతం ఫేస్‌బుక్‌లో వైరల్ అవుతోంది. 


ఇప్పటికే ఓ యువనటిపై అత్యాచారం కేసు నమోదవడంతో విజయ్ బాబు పరారీలో ఉన్నాడు. ఇప్పుడీ ఫేస్ బుక్ పోస్టుతో మరింత చిక్కుల్లో పడ్డాడు.


Also read: Ketika Sharma Hot Images: సాఫ్ట్ గ్లామ్ అంటూ.. కుర్రాకారుని కవ్విస్తున్న కేతిక శర్మ!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook