2018 Movie Oscars Entry: మాలీవుడ్ సూపర్ హిట్ మూవీ 2018 ఆస్కార్ బరిలో నిలిచింది. బెస్ట్ ఇంట‌ర్‌నేష‌న‌ల్ ఫిల్మ్ కేట‌గిరీలో ఇండియా నుంచి అఫీషియ‌ల్ ఎంట్రీని ద‌క్కించుకున్న‌ది. 2018లో కేర‌ళ‌ను అల్లకల్లోలం చేసిన వరదల నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కింది. ఈ చిత్రానికి దర్శకుడు జూడ్ ఆంథోనీ జోసెఫ్. ‘ఎవ్రీవ‌న్ ఈజ్ ఎ హీరో’అనేది ఈ సినిమా క్యాప్షన్. ఈ సినిమాలో టొవినో థామ‌స్‌, అప‌ర్ణా బాల‌ముర‌ళి, కుంచ‌కోబోబ‌న్‌, వినీత్ శ్రీనివాస‌న్‌, అసిఫ్ అలీ తదితరులు కీలకపాత్రలు పోషించారు. నోబిన్ పాల్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని వేణు కున్నప్పిళ్లై, సీకే పద్మ కుమార్, ఆంటో జోసెఫ్ నిర్మించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మ‌ల‌యాళంలో మే 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా 200 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. మ‌ల‌యాళ సినీ చ‌రిత్ర‌లోనే అత్య‌ధిక వ‌సూళ్ల‌ను సాధించిన సినిమాగా 2018 రికార్డు సృష్టించింది. ఈ సినిమా తెలుగులోనూ బాగానే ఆడింది. ప్రముఖ నిర్మాత బన్నీవాస్ ఈ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో రిలీజ్ చేశారు. ఈ మూవీకి ప్రొడ్యూసర్ కు మంచి లాభాలనే తెచ్చిపెట్టింది. 


స‌హ‌జ‌త్వం ఉట్టిప‌డేలా స‌న్నివేశాల్ని తీర్చిదిద్దారు ద‌ర్శ‌కుడు. ఇందులో చేసిన నటులు ఆయా పాత్రల్లో ఒదిగిపోయారు. ఈ మూవీని చూస్తుంటే కొందరి జీవితాల్ని దగ్గర నుంచి చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఒక్కో పాత్ర వ‌ర‌ద‌ల్లో చిక్కుకుని నిస్స‌హాయ స్థితిలో ఉండ‌టం చూసి మన హృద‌యాలు బ‌రువెక్కిపోతాయి.  వ‌ర‌ద‌ల్లో మ‌న‌మే చిక్కుకుపోయామా అనుకునేంత గొప్పగా తెరకెక్కించాడు దర్శకుడు. ఆపద సమయంలో అందరూ సమానమే అన్న సందేశాన్ని ఇచ్చింది ఈ మూవీ. అందుకే ఈ మూవీకి ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయ్యారు. అయితే తెలుగు నుంచి బలగం, దసరా సినిమాలను ఆస్కార్ ఎంట్రీకి పంపినప్పటికీ తుది జాబితో చోటు దక్కించుకోలేకపోయాయి. 


Also Read: Jailer 2: వామ్మో.. జైలర్ సీక్వెల్ కోసం డైరెక్టర్ కు అన్ని కోట్ల రూపాయల అడ్వాన్సా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook