Babun Banerjee: ఓటు వేయడానికి వెళ్లిన ముఖ్యమంత్రి తమ్ముడికి భారీ షాక్.. ఏం జరిగిందంటే?
Babun Banerjee Name Missed In Voter List: పోలింగ్ కేంద్రంలో ఓటు వేయడానికి వెళ్లి ముఖ్యమంత్రి తమ్ముడికి భారీ షాక్ తగిలింది. అతడి పేరు ఓటరు జాబితాలో గల్లంతవడం కలకలం రేపింది.
Babun Banerjee Name Missed: ఎన్నికల్లో ఓటు వేయడానికి వెళ్లిన ముఖ్యమంత్రి తమ్ముడు ఖంగుతిన్నారు. ఓటు వేసేందుకు తన పేరు పరిశీలించగా పేరు కనుమరుగైంది. ఓటరు జాబితాలో తన పేరు గల్లంతవడం చూసి ఆయన విస్మయం వ్యక్తం చేశారు. ఒక ముఖ్యమంత్రి సోదరుడికే ఇలాంటి పరిణామం ఎదురుకావడం కలకలం రేపింది. అతడి ఓటు గల్లంతవడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ సంఘటన పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకుంది.
Also Read: Kavtiha: కల్వకుంట్ల కవితకు మళ్లీ నిరాశే! కానీ ఇక్కడే భారీ ట్విస్ట్.. ఏం జరిగిందంటే?
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ సోదరుడు బబున్ బెనర్జీ. ఆయనకు హావ్‌డా ప్రాంతంలో బబున్‌కు ఓటు హక్కు ఉంది. ఐదో విడతలో భాగంగా పశ్చిమ బెంగాల్‌లో సోమవారం లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కు వినియోగించుకునేందుకు బబున్ వెళ్లారు. అక్కడ ఎన్నికల అధికారులకు తన ధ్రువపత్రం చూపించి ఓటరు జాబితాలో పేరు పరిశీలించారు. అయితే ఓటరు జాబితాలో అతడి పేరు లేదని సిబ్బంది చెప్పారు. తన పేరు లేకపోవడంపై బబున్ బెనర్జీ అసహనం వ్యక్తం చేశారు. ఆ వెంటనే పోలింగ్ కేంద్రం నుంచి బయటకు వెళ్లిపోయారు.
ఓటు హక్కు గల్లంతు కావడంపై బబున్ బెనర్జీ స్పందన తెలుసుకునేందుకు మీడియా ప్రయత్నించగా ఆయన సమాధానం ఇవ్వకుండా కారు ఎక్కి వెళ్లారు. అయితే అతడి ఓటు హక్కు గల్లంతు కావడంపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ స్పందించింది. 'బబున్ బెనర్జీ ఓటు హక్కు గల్లంతు కావడంపై ఎన్నికల సంఘం పరిశీలన చేస్తోంది. ఏం జరిగిందో దానిపై వివరణ ఇస్తుంది' అని టీఎంసీ ప్రకటించింది. అయితే ఉద్దేశపూర్వకంగానే బబున్ ఓటు హక్కు గల్లంతు చేశారనే ఆరోపణలు, విమర్శలు వస్తున్నాయి. ఇటీవల మమత, బబున్‌కు మధ్య విబేధాలు నెలకొన్నాయి.
హావ్‌డా లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థిపై అక్కాతమ్ముళ్ల మధ్య వివాదం మొదలైంది. సిట్టింగ్ ఎంపీ ప్రసూన్ బెనర్జీకి మరోసారి టికెట్ ఇవ్వడంపై బబున్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక్కడి నుంచి ఆయన టికెట్ ఆశించారు. తన సోదరి టికెట్ ఇవ్వకపోవడంతో టీఎంసీకి వ్యతిరేకిగా మారారు. బబున్ బెనర్జీ బెంగాల్‌లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఆయన బెంగాల్ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడిగా, బెంగాల్ హాకీ సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. బెంగాల్ బాక్సింగ్ సంఘం కార్యదర్శిగా, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ క్రీడా విభాగం అధ్యక్షుడిగా కూడా బబూన్ బెనర్జీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter