Mammootty - Bramayugam OTT Streaming: మమ్ముట్టి ఫ్యాన్స్‌కు శుభవార్త.. నేటి నుంచే ప్రముఖ ఓటీటీలో `భ్రమయుగం` స్ట్రీమింగ్..
Mammootty - Bramayugam OTT Streaming: మల్లూవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన కేవలం మలయాళ భాషకే పరిమితం కాకుండా ప్యాన్ ఇండియా లెవల్లో అన్ని భాషల్లో సత్తా చాటారు. ఈయన ఓ వైపు కమర్షియల్ సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు ప్రయోగాత్మక సినిమాలు చేయడంలో ఎపుడు ముందుంటారు. రీసెంట్‌గా ఈయన భ్రమయుగం సినిమాతో పలకరించారు. బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ సినిమా ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
Mammootty - Bramayugam OTT Streaming: హిట్, ఫ్లాప్ అనే సంబంధం లేకుండా.. కథను నమ్మితే.. ఎలాంటి పాత్రలోనైనా నటించడం మమ్ముట్టి స్టైల్. అంతేకాదు ఈయన ప్రయోగాత్మక చిత్రాలు చేయడంలో ఎపుడు వెనకాడ లేదు. ఈ డిజిటల్ యుగంలో కలర్‌లో కాకుండా బ్లాక్ వైట్‌లో 'భ్రమయుగం' సినిమాతో రీసెంట్‌గా పలకరించారు. ఈ సినిమా మలయాళంలో బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. కానీ మిగతా భాషల్లో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా వర్కౌట్ కాలేదు. మరోవైపు ఈ సినిమాలో మమ్ముట్టి నటనకు మంచి మార్కులే పడ్డాయి. ముందు నుంచి మమ్ముట్టి ఒక మూసకు పరిమితం కాకుండా డిఫరెంట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తుంటారు. తన ఇమేజ్‌కు ఆ కథ సరిపోతుందా లేదా అనే డౌట్స్ పెట్టుకోకుండా.. కాన్సెప్ట్ నచ్చితే వెంటనే చేసేయడం మమ్ముట్టి వర్కింగ్ స్టైల్. ఫ్యాన్స్ ఏమనుకుంటారో అనే డౌట్స్ కూడ పెట్టుకోకుండా తనకు తోచిన స్టోరీలను సినిమాలుగా చేసుకుంటూ వెళుతూ ఉంటారు. ఈ కోవలోనే ఈయన మూడు సార్లు జాతీయ ఉత్తమ నటుడు అవార్డును అందుకున్నారు.
మమ్ముట్టి నటించిన 'భ్రమయుగం' సినిమాను రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో మమ్ముట్టితో పాటు అర్జున్ అశోకన్, సిద్ధార్ధ భరతన్, అమల్డా లిజ్ ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమా మొత్తం ఓ అడవిలో ఉండే కుగ్రామం నేపథ్యంలో డిఫరెంట్ కాన్సెప్టతో ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత ఈ సినిమా నేటి నుంచి సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, తమిళం,హిందీ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
మమ్మట్టి విషయానికొస్తే.. ఆ మధ్య తెలుగులో 'యాత్ర' మూవీతో పలకరించారు. ఇందులో దివంగత ఏపీ ముఖ్యమంత్రి వై.యస్.రాజశేఖర్ రెడ్డి పాత్రలో నటించారు. రీసెంట్‌గా 'యాత్ర 2'లో అదే పాత్రను చేసారు. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ అందుకు తగ్గ వసూళ్లను రాబట్టడంలో విఫలమైంది. ఆ తర్వాత వెంటనే 'భ్రమయుగం' మూవీతో మమ్ముట్టి పలకరించారు. ఈ సినిమా మలయాళ బాక్సాఫీస్ దుమ్ము దులిపింది. మరి ఓటీటీ వేదికగా ఈ సినిమా ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter