Mamta Mohandas Skin Disease: ఈ మధ్యకాలంలో నటీమణులకు వరుసగా అరుదైన వ్యాధులు సోకుతూ రావడం సంచలనంగా మారింది. సమంత మొదలు అనేకమంది హీరోయిన్లు అరుదైన వ్యాధులతో బాధపడుతున్నట్లుగా ఇటీవల వెల్లడిస్తూ వస్తున్నారు. తాజాగా మమతా మోహన్ దాస్ కూడా తాను ఒక వ్యాధితో బాధపడుతున్నారు అంటూ కీలక విషయాన్ని బయట పెట్టింది. గతంలోనే ఆమె క్యాన్సర్ బారిన పడగా కీమోథెరపీ చేయించుకుని ఆ క్యాన్సర్ బారి నుంచి బయటపడింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మలయాళ భామ అయిన ఆమె వాస్తవానికి ముందు నటిగా పరిచయమైంది ఆ తరువాత సింగర్గానే  మారి అనేక సినిమాల్లో సూపర్ హిట్ సాంగ్స్ పాడింది. తెలుగులో ఆమె రాఖీ సినిమాలో టైటిల్ సాంగ్ సహా శంకర్ దాదా జిందాబాద్, జగడం వంటి సినిమాల్లో ఐటెం సాంగ్స్ పాడింది. అలాగే ఆమె నటిగా తెలుగులో యమదొంగ సినిమాతో ఎంట్రీ ఇచ్చి తర్వాత కృష్ణార్జున, కథానాయకుడు, చింతకాయల రవి, కింగ్, కేడి వంటి సినిమాల్లో కనిపించింది. తర్వాత క్యాన్సర్ బారిన పడిన ఆమె కొన్నాళ్లు సినీ పరిశ్రమకు దూరమైన తర్వాత రీ ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు వరుస సినిమాలు చేస్తోంది.


ప్రస్తుతం మలయాళ సినీ పరిశ్రమలో బిజీ బిజీగా గడుపుతున్న ఆమె తెలుగులో రుద్రాంగి అనే సినిమా చేస్తోంది. అయితే ఆమెకు తాజాగా ఒక చర్మ వ్యాధి సోకింది అనే విషయాన్ని తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఆమె షేర్ చేసింది. తాను బొల్లి వ్యాధితో బాధపడుతున్నట్లుగా మమతా మోహన్ దాస్ వెల్లడించింది.


ఆ వ్యాధి తన చర్మ రంగును కోల్పోయేలా చేస్తోందని క్రానిక్ ఆటో ఇమ్యూన్ దిజార్దర్ వల్ల ఈ వ్యాధి ఏర్పడినట్లు ఆమె వెల్లడించింది. ఇక ఈ పోస్ట్ చూసిన తర్వాత ఆమె అభిమానులు శ్రేయోభిలాషులు, స్నేహితులు ఆమెకు ధైర్యం చెబుతున్నారు మీకేం కాదని చర్మ సంబంధిత వ్యాధి ప్రాణాంతకం కాదని వారంతా ఆమెకు ధైర్యం చెబుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ విషయం మీ మీ ఉద్దేశం ఏమిటో కూడా కింది కింద కామెంట్ చేయండి.
Also Read: Jayasudha Clarity: అమెరికన్ వ్యాపారవేత్తతో మూడో పెళ్లి.. అసలు విషయం చెప్పిన జయసుధ!


Also Read: Anchor Rashmi Tweet: కోడి పందాల గురించి మాట్లాడితే చెప్పు తెగేలా కొడతారన్న నెటిజెన్..రష్మీ ఏమందో తెలుసా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook