Kadambari Kiran: తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న న‌టుడు కాదంబ‌రి కిర‌ణ్ మరోసారి తన దాతృత్వంని చాటుకున్నాడు. అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న పావ‌ల శ్యామ‌ల‌కు తన వంతు సహాయం చేసి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. రూ. 25,000 చెక్కును మనం సైతం ద్వారా అందించారు కాదంబ‌రి కిర‌ణ్


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సినీ నటుడు,‘మనం సైతం' ఫౌండేషన్ నిర్వ‌హ‌కులు కాదంబ‌రి కిర‌ణ్ ఎన్నో సమస్యల మధ్య ఉన్న సీనియర్ నటి పావ‌ల శ్యామ‌ల‌కు ఆర్థిక సహాయం చేసి దాతృత్వం చాటుకున్నాడు. గత కొద్దిరోజులుగా సీనియ‌ర్ న‌టి పావ‌ల శ్యామ‌లకు అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో పాటు ఆర్థిక స‌మ‌స్య‌లు తోడ‌య్యాయి. ఈ విషయం ఆమె ఈమధ్య ఎన్నో మీడియా ఛానల్స్ కి చెప్పుకొచ్చింది. ఇక ఈ విష‌యం తెలుసుకున్న కాదంబ‌రి కిర‌ణ్.. ఆమెకు రూ. 25,000 చెక్కును అందించారు. పావ‌ల శ్యామ‌లకు మెరుగైన వైద్యం, క‌నీస అవ‌స‌రాల‌ను తీర్చేలా సాయం చేశారు.  


ఎవరన్నా అవసరంలో ఉన్నారు అని తెలిస్తే వెంటనే సహాయం చేసే గుణం అయినది. మీడియా ద్వారా తెలుసుకున్న కాదంబరి కిరణ్ హైదరాబాద్ శివారులోని ఓ వృద్ధాశ్రమంలో ఉంటున్న నటి శ్యామల ను  తనంతట తానే వెతుకుంటు వెళ్లి ఆమెకు తన వంతు సహాయం చేసి పెద్దమనసు చాటుకున్నారు . ఆయ‌న మాన‌వ‌త్వానికి ప‌లువురు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.


చేతనైన సాయం కోసం.. ఎక్కడైనా..  ఎప్పుడైనా.. ఎవరికైనా..  ఏ ఆప‌ద వ‌చ్చినా.. మనం సైతం అంటూ కాదంబరి కిరణ్ ముందుకొస్తారు. అందుకే ఆయన అదే పేరుతో ఫౌండేషన్ మొదలుపెట్టి సహాయం చేస్తూ ఉన్నారు. సినీ పరిశ్రమలో పేద కార్మికులకు, అవసరాల్లో ఉన్న పేదలకు సహాయం చేయడానికి ‘మనం సైతం' ఎప్పుడూ ముందుంటుందని ఆయన పలుమార్లు వ్యక్తం చేశారు. ఆయన ఈ ఫౌండేషన్ స్థాపించి దశాబ్దం పైగా  నిర్విరామంగా  సేవలు కొనసాగించడం విశేషం. 


Also read: Japan Earthquake Scary Videos: జపాన్‌లో భారీ భూకంపం, భయపెడుతున్న వీడియోలు


Also Read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook