manchu Lakshmi at Varanasi : వాలెంటైన్స్ డే.. వారణాసిలో మంచు లక్ష్మీ.. ట్వీట్ వైరల్
manchu Lakshmi at Varanasi మంచు లక్ష్మీ ప్రస్తుతం షూటింగ్ మోడ్‌లో ఉంది. షూటింగ్ కోసం మంచు లక్ష్మీ వారణాసికి వెళ్లింది. ఇక అదే ఊపులో కాశీ విశ్వనాథుడిని దర్శించుకుంది. ఈ మేరకు మంచు లక్ష్మీ వేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
manchu Lakshmi at Varanasi మంచు లక్ష్మీ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. మోహన్ లాల్‌తో చేసిన మాన్ స్టర్ సినిమాతో విలన్‌గా కనిపించిన మంచు లక్ష్మీ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె చేసిన యాక్షన్ సీక్వెన్స్‌లు సైతం అదిరిపోయాయి. అలా మంచు లక్ష్మీ ఇప్పుడు కొత్త కథలను ఎంచుకుంటూ బిజీగా ఉంది. ఆమె ఇప్పుడు అగ్ని నక్షత్రం అనే సినిమాను నిర్మిస్తూ నటిస్తూ బిజీగా ఉంది. ఈ మూవీ షూటింగ్ కోసమే వారణాసికి వెళ్లినట్టుగా తెలుస్తోంది.
నేడు వారణాసిలో సాంగ్ షూటింగ్ జరగబోతోందట. ఐదు గంటలే టైం ఉందని, పాట షూటింగ్ ఉందని, అది త్వరగా, సక్రమంగా అవ్వాలని కోరుకోండి అంటూ మంచు లక్ష్మీ ట్వీట్ వేసింది. ఇక వారణాసిలో కాశీ విశ్వనాథుడ్ని సైతం మంచు లక్ష్మీ దర్శించుకుందట. ఈ మేరకు ఆమె వేసిన ట్వీట్ అందరినీ ఆకట్టుకుంటోంది. వాలెంటైన్స్ డే స్పెషల్‌గా ఇలా కాశీ విశ్వేశ్వరుడ్ని దర్శించుకున్నానంటూ చెప్పుకొచ్చింది.
నాకు నేనే వాలెంటైన్స్ డే విషెస్ చెప్పుకుంటున్నాను.. నా జీవితంలో ఉన్న ప్రేమ అంతా కూడా ఆ శివుడికే.. ఇప్పుడు కాశీలోని విశ్వనాథుడి వద్దకు వచ్చాను.. నేను ఈ రోజు ఇలా ఇక్కడకు రావడం కూడా విధే.. అదే ప్రేమ.. అనుకోని ప్రయాణం.. శంభు అంటూ ట్వీట్ వేసింది మంచు లక్ష్మీ.
మంచు ఫ్యామిలీ మీద ఎప్పుడూ ట్రోలింగ్ జరుగుతూనే ఉంటుందన్న సంగతి తెలిసిందే. మంచు విష్ణు, మంచు లక్ష్మీ, మంచు వారి సినిమాల మీద సోషల్ మీడియాలో ఎక్కువగా మీమ్స్, ట్రోల్స్ జరుగుతుంటాయి. కానీ ఇప్పుడు మాత్రం మంచు లక్ష్మీని అంతా మెచ్చుకుంటున్నారు. వాలెంటైన్స్ డే అంటూ అక్కడా ఇక్కడా తిరక్కుండా ఇలా గుడికి వెళ్లడంపై పాజిటివ్ కామెంట్లు చేస్తున్నారు. మంచు లక్ష్మీ మామూలుగా ఇలా బయటకు షూటింగ్‌లకు వెళ్తే తన పాప విద్యా నిర్వాణను కూడా తీసుకెళ్తుంటుంది. కానీ కాశీకి మాత్రం విద్యను తీసుకెళ్లినట్టుగా కనిపించడం లేదు.
Also Read: Sreeleela Latest Photos : శ్రీలీల.. పెడుతోంది గుండెల్లో గోల.. చూస్తే తట్టుకోలేరంతే
Also Read: Supritha Photos : వామ్మో అనిపించేలా సుప్రిత అందాలు.. తల్లితో కలిసి బీచ్‌లో అలా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook