Manchu Laxmi Yuvraj: తండ్రి వారసత్వంగా సినీ పరిశ్రమలోకి ప్రవేశించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన నటి మంచు లక్ష్మీప్రసన్న ప్రస్తుతం సినిమాలపరంగా దూరమైన తన సామాజిక మాధ్యమాల ద్వారా ప్రేక్షకులకు చేరువగా ఉంటున్నారు. తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. అర్ధరాత్రి క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌తో మంచు లక్ష్మి కనిపించింది. వారిద్దరూ ఆలింగనం చేసుకుని చాలా చనువుగా ఉన్నారు. దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఒక్కసారిగా నెట్టింట్లో చక్కర్లు తిరుగుతున్నాయి.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Pushpa 2: పుష్ప 2 నుంచి సర్ప్రైజ్ చేసిన కొత్త అప్డేట్.. అదిరిపోయిన పోస్టర్..!


మంచు కుటుంబంలో అక్టోబర్‌ 8వ తేదీన మహాలక్ష్మి పుట్టింది. ఆమె ఎవరో కాదు లక్ష్మీ ప్రసన్నే! తన జన్మదినం సందర్భంగా సోమవారం రాత్రి ఏర్పాటుచేసిన బర్త్‌ డే పార్టీలో సినీ తారలు, వివిధ రంగాల ప్రముఖులతోపాటు లక్ష్మి ఆత్మీయులు హాజరయ్యారు. ఎంతో హుషారుగా.. ఉత్సాహంగా జరిగిన పార్టీలో భారత క్రికెట్‌ మాజీ ఆటగాడు.. సిక్సర్ల వీరుడు యువరాజ్‌ సింగ్‌ ప్రత్యక్షమయ్యాడు. లక్ష్మీ పార్టీలో యువీ పాల్గొని సందడి చేశాడు. ఈ సందర్భంగా లక్ష్మీని ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలిపాడు. అనంతరం వచ్చిన అతిథులతో అతడు కూడా ఎంజాయ్‌ చేశాడు.

Also Read: Nagarjuna: నాంపల్లి కోర్టులో హజరైన నాగార్జున.. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఏం చెప్పారంటే..?


ఈ బర్త్‌ డే పార్టీ కోసం యువీ ప్రత్యేకంగా హైదరాబాద్‌ రావడం చర్చనీయాంశంగా మారింది. అసలు లక్ష్మీ ప్రసన్నకు యువీకి ఏమిటి సంబంధం అనే చర్చ మొదలైంది. అయితే యువీ, లక్ష్మీ మంచి స్నేహితులు అని సమాచారం. క్రికెటర్‌గా ఉన్న సమయంలో యువీ హైదరాబాద్‌ వచ్చినప్పుడు లక్ష్మీని తరచూ కలిసేవాడు. ఈ క్రమంలోనే బర్త్‌ డేకు హాజరయ్యాడని తెలుస్తోంది. ఇక ఈ బర్త్‌ డే పార్టీలో సినీ తారలు ప్రగ్యా జైస్వాల్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తదితరులు హాజరయ్యారు. సామాజిక మాధ్యమాల వేదికగా లక్ష్మీ ప్రసన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువలా వచ్చాయి.

జూనియర్‌ ఎన్టీఆర్‌ సతీమణి స్నేహ, కొణిదెల సుస్మిత కూడా సందడి చేశారు. తన పుట్టినరోజు వేడుకకు సంబంధించిన వీడియోను లక్ష్మీ తన సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఆ వీడియోలో అందరి కళ్లు యువీపై పడ్డాయి. పొద్దెక్కే దాకా పార్టీలో వారు మునిగితేలారని అర్థమవుతోంది. కాగా మంచు లక్ష్మీ ప్రసన్న ప్రస్తుతం కొన్ని సినిమాలతో బిజీగా ఉందని సమాచారం. త్వరలోనే అప్‌డేట్స్‌ వస్తాయని తెలుస్తోంది. కాగా ప్రస్తుతం తన తండ్రి మోహన్‌ బాబుకు దూరంగా లక్ష్మీ ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మంచు మనోజ్‌, లక్ష్మీ ప్రసన్న ఇద్దరూ తండ్రితో విడిపోయారని చర్చ జరుగుతోంది.






స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter