Manchu Manoj Bhuma Mounika Wedding Pics మంచు మనోజ్ భూమా మౌనికరెడ్డిల వివాహాం నేడు (మార్చి 3) జరుగుతోందన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ పెళ్లి గురించి ఎక్కడా అధికారికంగా ప్రకటన రాలేదు. కానీ తాజాగా మంచు మనోజ్ మాత్రం పెళ్లి కూతురు అంటూ భూమా మౌనిక ఫోటోను షేర్ చేశాడు. మనోజ్ వెడ్స్ మౌనిక అని హ్యాష్ ట్యాగ్ పెట్టేశాడు. అలా మొదటి సారిగా పెళ్లి మీద నోరు విప్పినట్టు అయింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హైదరాబాద్‌ లోని ఫిల్మ్‌ నగర్‌లో వీరి విహహాం జరగనుంది. రాత్రి 8.30 నిమిషాలకు మౌనిక మెడలో మంచు మనోజ్ తాళిని కట్టనున్నాడు. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ పెళ్లి తంతు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇండస్ట్రీ నుంచి అతి సన్నిహితులను మాత్రమే ఆహ్వానించినట్టుగా కనిపిస్తోంది.


మంచు మనోజ్ రెండో పెళ్లి మీద రకరకాల కామెంట్లు వినిపించసాగాయి. అయితే ఎప్పుడూ కూడా మంచు మనోజ్ తన రెండో పెళ్లి గురించి క్లారిటి ఇవ్వలేదు. కానీ సోషల్ మీడియాలో రెండో పెళ్లి మీద రూమర్లు వచ్చినప్పుడు ఖండించేవాడు. పెళ్లి కూతురు కూడా ఎవరో చెప్పు.. పెళ్లి ఎప్పుడో కూడా చెప్పండి అంటూ రూమర్ల స్ప్రెడ్ చేసే వారి మీద కౌంటర్లు వేస్తుండేవాడు.


 



మొత్తానికి మంచు వారింట్లో ఇప్పుడ సంబరాలు మొదలయ్యాయి. మంచు మనోజ్ రెండో పెళ్లి మీద సోషల్ మీడియాలోనూ పాజిటివ్ కామెంట్లే కనిపిస్తున్నాయి. మంచు మనోజ్ మొదటి వివాహాన్ని రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. విడాకులు తీసుకున్నాను అయినా తను ఎప్పటికీ ఓ మంచి ఫ్రెండ్‌లా ఉంటుందని మంచు మనోజ్ చెప్పుకొచ్చాడు. పర్సనల్ లైఫ్‌లోని ఇబ్బందుల వల్లే సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చాడు. 


కరోనా సమయంలో ఓ సినిమాను ప్రారంభించాడు. అహం బ్రహ్మాస్మి అంటూ పాన్ ఇండియన్ లెవెల్లో స్టార్ట్ చేశాడు. కానీ ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఇప్పుడు వాట్ ది ఫిష్ అంటూ రాబోతోన్నాడు. మరి ఈ ఏడాది మంచు మనోజ్ పర్సనల్ లైఫ్‌, సినీ లైఫ్‌ కలిసి వచ్చేలానే ఉంది. మున్ముందు మంచు మనోజ్ నుంచి ఎలాంటి సినిమాలు వస్తాయో చూడాలి.


Also Read:  Balagam Movie Review : బలగం మూవీ రివ్యూ.. తెలంగాణకు అద్దం పట్టేలా


Also Read: Pragya Jaiswal Bikini : బాలయ్య భామ బికినీ ట్రీట్.. వెనకాల జరిగే పనులపై నెటిజన్ల ట్రోల్స్.. పిక్స్ వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook