Manchu Manoj Clarity on His Second Marriage: మంచు మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ గురించి తెలుగు వరికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దొంగ దొంగది అనే సినిమాతో హీరోగా పరిచయమై ఆ తరువాత అనేక సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ వచ్చిన అయన ఎందుకో సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. చివరిగా ఒక్కడు మిగిలాడు అనే సినిమాతో హీరోగా వచ్చిన ఆయన ఆ తర్వాత ఎందుకో సినిమాల మీద దృష్టి పెట్టడం లేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అహం బ్రహ్మాస్మి అని ఒక పాన్ ఇండియా మూవీ అనౌన్స్ చేసిన ఆయన తర్వాత దేశంలో కరోనా ఎంటర్ కావడంతో ఆ సినిమా విషయంలో ఎలాంటి ముందడుగు వేయలేదు. ఇక అనూహ్యంగా వినాయక చవితి సందర్భంగా భూమా కుటుంబానికి చెందిన భూమా మౌనికతో కలిసి కనిపించిన ఆయన కొత్త చర్చకు తావిచ్ఛారు. భూమా మౌనిక గతంలో వేరే వ్యక్తిని వివాహం చేసుకొని విడాకులు తీసుకున్నారు.  మంచు మనోజ్ కూడా అలాగే వివాహం చేసుకుని విడాకులు తీసుకున్నారు.


ఈ నేపద్యంలో వీరిద్దరికి వివాహం జరిగే అవకాశం ఉందని అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇదే విషయాన్ని అప్పట్లోనే మంచు మనోజ్ క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే మీడియా ముందుకు వచ్చి అన్ని విషయాలు చెబుతానని అప్పట్లో పేర్కొన్నారు. ఇక తాజాగా కడప జిల్లాలో ఫేమస్ అయిన కడప దర్గాను సందర్శించిన ఆయన మంచు మనోజ్ అక్కడ కూడా తన పెళ్లి గురించి పరోక్షంగా కామెంట్స్ చేశారు.


చాలాకాలం నుంచి కడప దర్గా దర్శించుకోవాలని అనుకుంటున్నాననీ తన కుటుంబ సభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు అందరూ ఈ దర్గాకి వచ్చినా తాను ఇక్కడికి రావడానికి ఎందుకో సమయం పట్టిందని ఆ అల్లా ఇప్పుడు తనను ఇక్కడికి పిలిపించుకున్నారని మంచు మనోజ్ చెప్పుకొచ్చారు.


అంతేకాక త్వరలోనే తన సినిమాలు ప్రారంభమవుతున్నాయని, అలాగే కొత్త జీవితం కూడా ప్రారంభిస్తున్నామని ఆయన పేర్కొనడంతో త్వరలో మంచు మనోజ్ రెండో వివాహం చేసుకోబోతున్నారనే దానికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే వెలువడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇక ఈ సందర్భంగా మంచు మనోజ్ మాట్లాడుతూ ఫిబ్రవరి నుంచి తన నటిస్తున్న సినిమాల షూటింగ్స్ కూడా మొదలు కాబోతున్నాయని పేర్కొన్నారు.


Also Read: Upasana Surrogacy : సరోగసి ద్వారా బిడ్డను కంటోన్న ఉపాసన.. అసలు మ్యాటర్ ఇదా?


Also Read: Avatar 2 Movie Review: అవతార్ ‌- ది వే ఆఫ్‌ వాటర్‌ రివ్యూ.. జేమ్స్ కెమెరూన్ మేజిక్ పని చేసిందా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook