Manchu Manoj second marriage news: మంచు మనోజ్ రెండో పెళ్లికి రెడీ అవుతున్నాడు. గత మూడేళ్లుగా సినిమాల్లో అంత యాక్టివ్‌గా లేని మంచు మనోజ్ అదే సమయంలో తన మొదటి పెళ్లికి సంబంధించిన డైవర్స్ ప్రాసెస్ పూర్తి చేసుకున్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో తిరుపతితో పాటు అక్కడికి సమీపంలోని వారి విద్యా సంస్థలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకున్నట్టు సమాచారం. ఈ మొత్తం క్రమంలో Weight loss అయిన మంచు మనోజ్ తిరిగి కొంత సన్నబడ్డాడట. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read : Sreekaram Trailer: శ్రీకారం ట్రైలర్.. రైతుల జీవితం గురించే


ఇటీవలే తిరిగి సినిమాల్లో బిజీ అయిన మంచు మనోజ్ ప్రస్తుతం ఆ సినిమాను పూర్తి చేసే పనిలో పడ్డాడు. ఇదిలావుంటే, ఇటీవలే ఓ అమ్మాయితో ప్రేమలో పడిన మంచు మనోజ్ ఈ ఏడాది చివర్లో ఆమెతో పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధపడుతున్నట్టు ఫిలింనగర్ టాక్. అయితే, Manchu Manoj ‌ను ప్రేమలో పడేసిన ఆ అమ్మాయి ఎవరనేది మాత్రం ఇంకా తెలియలేదు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook