Ginna Movie Postponed : పెద్దలతో ఎందుకులే.. వెనక్కు తగ్గిన మంచు విష్ణు.. జిన్నా వాయిదా!
Manchu Vishnu Ginna Movie Postponed to October 21st: మంచు విష్ణు హీరోగా నటించిన జిన్నా సినిమా అక్టోబర్ 21వ తేదీకి వాయిదా పడినట్లు తెలుస్తోంది.
Manchu Vishnu Ginna Movie Postponed to October 21st: తెలుగులో ఒకటి రెండు సినిమాలు తప్ప చెప్పుకోదగ్గ సినిమాలేవీ లేని మంచు విష్ణు ఈ సారి ఎలా అయినా ఒక హిట్ అందుకోవాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు. గత ఏడాది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో ప్రెసిడెంట్ గా నిలబడి ప్రకాష్ రాజు మీద ఘన విజయం సాధించిన మంచి విష్ణు అప్పటినుంచి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నాడు.
ట్రోలర్లకు ఒకపక్క టార్గెట్ అవుతూనే మరో పక్క తన క్రేజ్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు మంచు విష్ణు జిన్నా అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎందుకు సిద్ధమవుతున్నాడు. సూర్య డైరెక్షన్లో ఈ సినిమా రూపొందింది. ఒకపక్క శృంగార తార సన్నిలియోన్ మరోపక్క హాట్ బాంబ్ గా పేరు తెచ్చుకున్న పాయల్ రాజ్ పుత్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా అక్టోబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుందని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.
దసరా సందర్భంగా ప్రేక్షకులను మంచు విష్ణు అలరించబోతున్నాడని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఈ సినిమా అక్టోబర్ 21వ తేదీ వాయిదా పడినట్లు తెలుస్తోంది. దానికి సంబంధించిన అధికారిక ప్రకటన అయితే ఇంకా విడుదల కాలేదు. నిజానికి అక్టోబర్ 5వ తేదీన మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ నాగార్జున నటించిన ది గోస్ట్ సినిమాలు విడుదలవుతున్నాయి. ఈ రెండు సినిమాలతో పాటు స్వాతిముత్యం అనే మరో సినిమా కూడా విడుదలవుతోంది.
బెల్లంకొండ సురేష్ చిన్న కొడుకు గణేష్ హీరోగా రుపొందిన ఈ స్వాతిముత్యం సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నిర్మించారు. ఈ సినిమాను త్రివిక్రమ్ భార్య సౌజన్య సహ నిర్మించారు. ఈ మూడు సినిమాలతో పాటు జిన్నా సినిమా కూడా వస్తుందనుకున్నారు కానీ ఎందుకో ఈ సినిమా వాయిదా వేయడానికే నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సహ నిర్మించిన ఈ సినిమాలో వెన్నెల కిషోర్, సునీల్ కీలకపాత్రలో నటిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ సినిమా అన్ని భాషల్లో విడుదల అవుతుందా లేదా అనేది కూడా చూడాల్సి ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook