Kannappa: కన్నప్ప ఫస్ట్ లుక్ విడుదల.. అదిరిపోయే గెటప్ లో అలరించిన విష్ణు
Kannappa First Look: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ఫస్ట్ లుక్ .. ఈరోజు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా విడుదల అయ్యింది. ఈ పోస్టర్‌లో విష్ణు సరికొత్త గెటప్ లో కనిపిస్తూ ఈ చిత్రంపై అంచనాలను మరింత పెంచేశారు.
Manchi Vishnu:
మంచు విష్ణు ప్రస్తుతం ఒక భారీ విజయం కోసం తెగ ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తన రాబోయే సినిమా కన్నప్ప పైన ఎన్నో అంచనాలను పెట్టుకున్నారు.
ఈ చిత్రంపై అంచనాలు ముందు నుంచి భారీగానే ఉన్నాయి. ఈ సినిమాలో అన్ని ఇండస్ట్రీల నుంచి స్టార్ కూడా బాగం కావడం ఈ చిత్రంపై ఆసక్తిని నెలకొల్పింది. తాజాగా మహాశివరాత్రి సందర్భంగా "కన్నప్ప" ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు ఈ సినిమా యూనిట్.
కన్నప్పగా విష్ణు మంచు సరికొత్త గెటప్ లో అందరినీ ఆకట్టుకునేలా ఈ పోస్టర్‌లో కనిపిస్తున్నారు. ఇప్పటిదాకా వచ్చిన అప్డేట్స్ కన్నా ఇప్పుడు ఈ ఫస్ట్ లుక్ ఈ సినిమాపై మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది. "కన్నప్ప" ఓ దృశ్యం కావ్యంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అని ఇప్పటికే ఈ సినిమా తెలియజేసిన సంగతి తెలిసిందే.
శివుని భక్తుడైన కన్నప్ప కథను హై ఎఫెక్ట్స్ జోధించి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరపైకి తీసుకొస్తున్నారు. కన్నప్ప లాంటి గొప్ప పాత్రను విష్ణు ఎలా చేస్తారో అనే సందేహాలు ఉన్న సమయంలో ఈ ఫస్ట్ లుక్ ఆ సందేహాలకు ఫుల్స్టాప్ పెట్టింది. ఈ లుక్ విష్ణు కన్నప్ప గెటప్ లో పర్ఫెక్ట్ గా సరిపోతారు అని నమ్మకం తెచ్చిపెట్టింది.
ఈ పోస్టర్ లో విష్ణు ఎంతో పవర్ఫుల్ గా కనిపిస్తూ కన్నప్ప క్యారెక్టర్ లోని ధైర్యంని.. ప్రతిబింబించేలా ఉన్నారు. ఈ ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా ఎప్పటికీ చెరిగిపోని ముద్రను వేసేలా ఉంది. ఈ పోస్టర్ చూస్తుంటే బాక్సాఫీస్‌పై విష్ణు మంచు ఆ విల్లు ఎక్కుపెట్టినట్టుగా కనిపిస్తోంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రిలీజ్ చేసిన పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక మంచు మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ మూవీకి సినిమాకి కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో నయనతార, మోహన్ లాల్, ప్రభాస్, శరత్‌కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు.
Also Read: DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. భారీగా జీతాలు పెంపు
Also Read: ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు హోలీకి ముందు సూపర్ గిఫ్ట్.. సర్‌ప్రైజ్ వచ్చేసిందిగా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి