Manchu Vishnu Sensational Tabout Pawan Kalyan: రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంతో ఉత్కంఠ రేపిన 'మా' ఎన్నికలు (MAA Elections 2021) ఫలితాలలో మంచు విష్ణు (Manchu Vishnu) విజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే. 'మా' ఎన్నికలు (MAA Elections) ముగిసిన తరువాత కూడా మెగా ఫ్యామిలీ (Mega Family)- మంచు ఫ్యామిలీ (Manchu Family) మధ్య వైరం ఇంకా కొనసాగుతున్నట్టుగానే ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బండారు దత్తాత్రేయ (Bandaru Dattatreya) నిర్వహించిన అలాయి- బలాయి (Alai Balai Program) కార్యక్రమంలో చోటు చేసుకున్న సంఘటనలే దీనికి సాక్ష్యం అని చెప్పవచ్చు. దత్తాత్రేయ ఆధ్వర్యంలో మంచు విష్ణు - పవన్ కళ్యాణ్ (Manchu Vishnu- Pawan Kalyan) ఇద్దరు హాజరు అయ్యారు. అంతేకాకూండా స్టేజీపై కూడా పక్క పక్కనే కూర్చొన్నారు. అయినా కూడా ఇద్దరి మధ్య మాటల్లేవు.. కనీసం ఎదురుపడినపుడు కూడా మాట్లాడుకోలేదు. దీని ఫలితంగా 'మా' ఎన్నికల చిచ్చు ఇంకా కొనసాగుతూనే ఉంది అంటున్నాయి సినీ వర్గాలు.


Also Read: Yudh Abhyas: ఇండియా అమెరికా సైనికులు ఒకరిపై మరొకరు ఏం విసురుకుంటున్నారో తెలుసా


మెగా బ్రదర్ నాగ బాబు (Naga Babu) ప్రకాష్ రాజ్ ప్యానల్ (Prakash Raj Panel) కు మద్దతు తెలపటం.. రిపబ్లిక్ సినిమా (Republic Movie) ఫంక్షన్ లో పవన్ కొన్ని ప్రశ్నలు సందించటం.. అవి సినీ ఇండస్ట్రీలో దుమారం లేపటం.. వీటి పై మోహన్ బాబు (Mohan Babu) ఎన్నికల తరువాత సమాధానం చెప్తాననటం.. ఇలా రెండు కుటుంబాల మధ్య గ్యాప్ పెంచిందని చెప్పవచ్చు. స్టేజీపై పక్క పక్కనే ఉన్న పవన్- విష్ణు కనీసం మాట్లాడుకోలేకపోవటం ఇరు వర్గాల మధ్య దూరం పెంచిందనే చెప్పవచ్చు. 


కానీ కార్యక్రమం ముగిసిన అనంతరం మంచు విష్ణు తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఒక వీడియో పోస్ట్ చేసాడు. ఈ పోస్ట్ లో ఒక వీడియో, దాంట్లో ఉన్నది ఎవరో గుర్తు పట్టండి అంటూ పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఉంది పవన్ కళ్యాణ్ అవ్వటం గమనార్హం.




Also Read: Samantha New Conditions To Directors: నయన్ దారిలో సమంత.. దర్శకులకు కొత్త కండీషన్లు


పోస్ట్ చూసిన అభిమానులు భిన్నంగా రియాక్ట్ అవుతున్నారు. నచ్చిన విధంగా కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా.. ఇరు కుటుంబాల మధ్య కలహాలు రేగటం.. మంచు మనోజ్ (Manchu Manoj) పవన్ ను కలవటం.. పవన్-విష్ణు బహిరంగంగా ఎడమొహం -పెడమొహం పెట్టుకోవటం.. మళ్లీ మంచు విష్ణు పవన్ వీడియో పోస్ట్ చేయటం.. వంటి చర్యలతో అభిమానులు ఇంకా గందరగోళంలోనే ఉన్నారన్నది మాత్రం వాస్తవం. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook