Manchu Vishnu Tweet on Shiva Shankar Master Health: ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టార్(Shiva Shankar Master) ఇటీవల కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. తాజాగా ఆయన ఆరోగ్యంపై 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు(Manchu Vishnu) స్పందించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాను ఫోన్ లో ఏఐజీ ఆస్రత్రి బృందంతో మాట్లాడినట్లు విష్ణు తెలిపారు. శివశంకర్‌(Siva shankar) మాస్టర్‌ కోలుకునేందుకు అన్నివిధాలుగా చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారన్నారు. ఆయన ఆరోగ్యం కోసం వైద్యులు ఎంతగానో శ్రమిస్తున్నారు. మాస్టర్‌ రెండో కుమారుడు అజయ్‌తోనూ ఫోన్‌లో మాట్లాడాను. ఇప్పుడు ఆయన కుటుంబానికి మీ ప్రార్థనలు ఎంతో అవసరమని మంచు విష్ణు ట్వీట్‌(Tweet) చేశారు.



Also rea: Siva Shankar master health condition: శివ శంకర్ మాస్టర్‌కి సోను సూద్ సహాయం


కొవిడ్(Covid-19) సోకటంతో... నాలుగు రోజుల నుంచి హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో శివశంకర్‌ మాస్టర్‌ చికిత్స  తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగా ఉంది. ఆయన సతీమణి, పెద్దకుమారుడికి సైతం వైరస్‌ బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన కుమారుడు అపస్మారక స్థితిలో ఉండగా.. సతీమణి హోం క్వారంటైన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. ఆస్పత్రి బిల్లులు చెల్లించడంలో మాస్టర్‌ కుటుంబసభ్యులు ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్న సోనూసూద్(Sonusood), ధనుష్‌.. తమ వంతు సాయమందించేందుకు ముందుకొచ్చారు. హీరో ధనుష్(Hero Dhanush) వైద్య ఖర్చుల నిమిత్తం ఏకంగా రూ.10 లక్షల ఆర్థిక సాయం చేశారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook