Raba Raba song: మంగ్లి పాటిన రబ రబ ఫుల్ వీడియో సాంగ్

Raba Raba song: మంగ్లి పాటిన రబ రబ ఫుల్ వీడియో సాంగ్
ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లి పాడిన రబ రబ అనే ఫోక్ సాంగ్‌ని ప్రముఖ సినీనటుడు విజయ్ దేవరకొండ ఇవాళ ట్విటర్ ( Vijay Deverakonda twitter ) ద్వారా విడుదల చేశారు. హిందీ, పంజాబీ భాషల్లో ప్రైవేటు, ఫోక్ ఆల్బమ్స్‌కి క్రేజ్ ఎక్కువ ఉన్న నేపథ్యంలో అదే తరహాలో తెలుగులోనూ ప్రైవేటు ఆల్బమ్స్, ర్యాప్స్ రూపొందించాలనే లక్ష్యంతో మధుర శ్రీధర్ చేస్తున్న ప్రయత్నంలో భాగంగా రూపొందించిన తొలి పాట ఇది. ఈ సందర్భంగా మధుర శ్రీధర్ కి శుభాకాంక్షలు తెలియజేస్తూ విజయ్ దేవరకొండ రబ రబ సాంగ్‌ని లాంచ్ చేశారు. లక్ష్మణ్ రచించిన గీతానికి బాజి మ్యూజిక్ అందించగా సింగర్ మంగ్లి, ర్యాపర్ మేఘ్ వాత్ ఈ పాట పాడారు.