మణిరత్నం సినిమా: అంచనాలు పెంచిన నవాబ్ సినిమా ట్రైలర్
నవాబ్ సినిమా ట్రైలర్
ప్రముఖ దర్శకుడు మణిరత్నం డైరెక్ట్ చేస్తోన్న తెలుగు, తమిళ ద్విభాషా నవాబ్ సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజైంది. అరవింద్ స్వామి, శింబు, విజయ్ సేతుపతి, జ్యోతిక, ఐశ్వర్య రాజేశ్, అదితి రావ్ హైదరి వంటి స్టార్ హీరో, హీరోయిన్స్‌తోపాటు ప్రకాశ్ రాజ్, జయసుధ, అరుణ్ విజయ్‌లు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఆడియెన్స్‌ని మెస్మరైజ్ చేస్తోంది. ఓ డాన్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ మణిరత్నం మార్క్‌కి తగినట్టుగా ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో ఆకట్టుకుంటోంది. తమిళంలో చెక్కా చివంతా వనమ్ పేరుతో లైక్ ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 28వ తేదీన ఆడియెన్స్ ముందుకు రానుంది.