Mannava Balayya Passes Away: టాలీవుడ్ సీనియర్‌ నటుడు మన్నవ బాలయ్య (92) కన్నుమూశారు. హైదరాబాద్ యూసఫ్‌గూడలోని తన నివాసంలో శనివారం ఉదయం తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబసభ్యులు చెప్పారు. అయితే ఆయన మృతికి గల కారణాలు తెలియరాలేదు. పుట్టినరోజు నాడే ఆయన మరణించడం తీవ్ర బాధకరం.  బాలయ్య మృతితో టాలీవుడ్ లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయన మృతికి తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నటనపై ఆసక్తితో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన మన్నవ బాలయ్య.. 300పైగా చిత్రాల్లో నటించారు. 'ఎత్తుకు పై ఎత్తు' సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత సినిమాల్లో నటిస్తూనే.. రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా ఎదిగారు.  


అమృత ఫిల్మ్స్‌ సంస్థ బ్యానర్‌పై శోభన్ బాబు హీరోగా నటించిన 'చెల్లెలికాపురం', సూపర్ స్టార్ కృష్ణతో 'నేరము - శిక్ష', 'చుట్టాలున్నారు జాగ్రత్త' సినిమాలతో పాటు మెగాస్టార్ చిరంజీవితో  'ఊరికిచ్చిన మాట' వంటి చిత్రాలను బాలయ్య నిర్మించారు. 


ఆ తర్వాత డైరెక్టర్ గా అవతారమెత్తి.. 'పసుపు తాడు', 'నిజం చెబితే నేరమా', 'పోలీసు అల్లుడు' చిత్రాలను రూపొందించారు. చిరంజీవితో కలిసి చేసిన 'ఊరికిచ్చిన మాట' సినిమాకు ఉత్తమ కథా రచయితగా నంది అవార్డు అందుకున్నారు. నిర్మాతగా 'చెల్లెలి కాపురం' సినిమాకు నిర్మాతగా నంది అవార్డు దక్కించుకున్నారు.  


Also Read: Acharya Pre-Release Date: ఆచార్య మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. ముఖ్యఅతిథిగా పవన్ స్టార్?


Also Read: Malavika Mohanan Photos: మోడ్రన్ డ్రస్సులోనే కాదు చీరకట్టులోనూ ఈమె అందానికి దాసోహమే!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook