Manobala Greatness Revealed by Actor Josh Ravi: ప్రముఖ తమిళ కమెడియన్, డైరెక్టర్, నిర్మాత అయిన మనోబాల చెన్నైలో ఈరోజు కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన వయసు 69 సంవత్సరాలు. గత రెండు వారాలుగా లివర్ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నై అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈరోజు ఆయన అనారోగ్య పరిస్థితి విషమించి కన్నుమూయడంతో తమిళ సినీ పరిశ్రమ అంతా ఒక్కసారిగా శోక సంద్రంలో మునిగి పోయినట్లు అయింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

35 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఆయన 700 పైగా సినిమాల్లో నటించినట్లు తెలుస్తోంది. మనోబాలకు భార్య ఉష కుమారుడు, హరీష్ ఉన్నారు. 1979వ సంవత్సరంలో భారతీరాజా దర్శకత్వంలోని సినిమాతో ఆయన తన కెరీర్ ప్రారంభించారు. కమలహాసన్ స్నేహితుడిగా ఆయన భారతీరాజా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పని చేసినట్లు చెబుతున్నారు. ఇక చివరిగా ఆయన వాల్తేరు వీరయ్య అనే తెలుగు సినిమాలో నటించారు. ఆ తర్వాత కాజల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఘోష్టీ సినిమాలో కూడా నటించారు.


Also Read: Sree leela Lineup: మహేష్, పవన్, దేవరకొండ సహా ఏడుగురు హీరోల సినిమాలు లైన్లో పెట్టిన శ్రీలీల


ఇక కాలేయ వ్యాధితో బాధపడుతూ చెన్నైలో నివాసంలో మరణించిన మనోబాల కన్నుమూశారనే విషయం తెలుసుకుని అనేకమంది సోషల్ మీడియా వేదికగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. మరీ ముఖ్యంగా రజనీకాంత్ అయితే తన మిత్రుడు, ప్రముఖ నటుడు దర్శకుడైన మనోభాల మరణ వార్త నన్ను ఎంతో భావించిందని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నానని పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని ప్రకటించారు. కమల్ హాసన్ కూడా మనోబాల మృతి తీవ్ర విషాదాన్ని నింపిందని ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.


అయితే మనోబాల గురించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని నటుడు జోష్ రవి వెల్లడించారు. మనోబాల చాలా ఇష్టమైన నటుడని చెబుతూనే ఆయన గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని కూడా జోష్ రవి పంచుకున్నారు. అదేమిటంటే మనోబాల సినిమా షూటింగ్ నిమిత్తం రామోజీ ఫిలిం సిటీ ఎప్పుడు వచ్చినా రామోజీ ఫిలిం సిటీ వైపు కారు దిగి చెప్పులు విప్పి బోర్లా పడిపోయి సాష్టాంగ నమస్కారం చేసి అప్పుడు లోపలికి వెళ్తారని, పనికి పని ప్రదేశానికి ఆయన అంత విలువ ఇస్తారని ఈ సందర్భంగా జోష్ రవి చెప్పుకొచ్చారు
Also Read: Tamannaah Unbuttoned Pic: చొక్కా విప్పేసి తమన్నా హాట్ ట్రీట్.. క్లీవేజ్ షోతో రచ్చోభ్యహ!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook