Mars and Mercury Transit 2022: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం... ప్రతి గ్రహం ఒక నిర్దిష్ట సమయంలో తన రాశి చక్రాన్ని మార్చుతుంది. గ్రహ సంచారం ప్రతి రాశిపై ప్రభావం చుపిస్తాయన్న విషయం తెలిసిందే. నవంబర్‌లో రెండు పెద్ద గ్రహాలు రాశి చక్రాన్ని మార్చబోతున్నాయి. నవంబర్‌ మాసంలో కుజుడు, బుధుడు కలిసి తమ రాశి చక్రాన్ని మార్చబోతున్నాయి. నవంబర్ 13న వృషభ రాశిలోకి కుజుడు.. వృశ్చికంలోకి బుధుడు మారనున్నాయి. ఈ రెండు గ్రహాల స్థానం మారడం వల్ల ఏ రాశుల వారికి మేలు జరగబోతోందో ఓసారి తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వృషభం:
నవంబర్‌ మాసంలో కుజుడు, బుధుడు రాశిచక్రం మారడం వల్ల వృషభ రాశి వారికి ప్రయోజనంగా ఉంటుంది. వృషభ రాశి వారికి వ్యాపారంలో లాభాలను బుధుడు ఇవ్వగలడు. ప్రతి పని మీకు అనుకూలంగా ఉంటుంది. అంగారక సంచారం వివాహానికి శుభప్రదంగా ఉంటుంది.


కర్కాటకం: 
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఈ రెండు గ్రహాల సంచారం కర్కాటక రాశి విద్యార్థులకు చాలా ప్రయోజనంగా ఉంటుంది. ఉన్నత శిఖరాలకు చేరుకుంటున్నారు. ఉద్యోగావకాశాలు ఉన్నాయి. ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. మీరు ఎప్పటినుంచో కోరుకుంటున్న కోరికలు నెరవేరుతాయి. 


సింహం:
సింహ రాశి చక్రంలోని తొమ్మిదవ మరియు త్రిభుజ గృహంలో కుజుడు సంచరించబోతోంది. రెండు మరియు పదకొండవ గృహంలో బుధ గ్రహం సంచరించబోతోంది. దాంతో సింహ  రాశి వారు వాహనాలు కొనుగోలు చేయవచ్చు. భూ వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులకు కలిసిరానుంది. ప్రతి రంగంలోని వారికి ధన లాభం ఉంటుంది. 


ధనుస్సు:
ధనుస్సు రాశి వారు తమ శత్రువులపై ఆధిపత్యం చెలాయిస్తారు. వ్యాపారాలలో లాభదాయకంగా ఉంటుంది. ప్రతిఒక్కరు తమ కెరీర్‌లో విజయం సాధిస్తారు. 


మకరం:
పరిశోధన చేసే వ్యక్తులకు లాభదాయకంగా ఉంటుంది. మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మకర రాశి వారి అన్ని కోరికలు నెరవేరుతాయి.


(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)


Also Read: 7th Pay Commission Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌పై బిగ్ అప్‌డేట్!


Also Read: IND vs SA: ఓటమి బాధలో ఉన్న టీమిండియాకు భారీ షాక్.. స్టార్ ప్లేయర్ ఔట్!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook