Maruti Gypsy Price: జిమ్నీని తలదన్నే మారుతీ జిప్సీ.. సూపర్ గుడ్ లుకింగ్! ధర 6.8 లక్షలు మాత్రమే
Buy Maruti Suzuki Gypsy 2022 Modified just Rs 6 Lakhs. ప్రస్తుత రోజుల్లో మారుతి జిప్సీని కొనాలని చాలా మంది ప్రయత్నిస్తున్నారు. అలాంటి వారికోసం ఇదే సువర్ణావకాశం.
Maruti Gypsy King Modified Model buy only Rs 6 Lakhs: ప్రముఖ కార్ల తయారీదారు సంస్థ 'మారుతి సుజుకి'.. ఇటీవల భారతీయ మార్కెట్‌లో తన ఎస్‌యూవీ 'మారుతి జిమ్నీ'ని పరిచయం చేసింది. మారుతి కంపెనీ నుంచి బాగా పాపులర్ అయిన ఎస్‌యూవీ కార్ 'మారుతి జిప్సీ'ని నిలిపివేసిన తర్వాత.. అదే విభాగంలో మారుతి జిమ్నీని రిలీజ్ చేసింది. మారుతీ జిప్సీని పోలీసులు లేదా మిలిటరీ వ్యక్తులు తరచుగా వాడటం మనం చూసి ఉంటాం. బలమైన ఆఫ్‌రోడింగ్ సామర్థ్యం ఉన్న మారుతి జిప్సీని ఇప్పటికీ చాలా మంది ఇష్టపడుతున్నారు.
ప్రస్తుత రోజుల్లో మారుతి జిప్సీని కొనాలని చాలా మంది ప్రయత్నిస్తున్నారు. అలాంటి వారికోసం ఇదే సువర్ణావకాశం. కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి తన వద్ద ఉన్న మాడిఫైడ్ జిప్సీని కేవలం రూ.6.8 లక్షలకు విక్రయిస్తున్నాడు. రుష్‌లేన్ నివేదిక ప్రకారం.. ఆ వ్యక్తి ఈ కారు వివరాలను ఫేస్‌బుక్ గ్రూప్‌లో పంచుకున్నారు. ఈ మారుతి జిప్సీ డిజైన్ ప్రాథమికంగా అలానే ఉంది. రెండు డోర్స్ పొడవు 4 మీటర్లు కాబట్టి మారుతి జిమ్నీ కంటే పొడవుగా ఉంటుంది. ఈ కార్ ఆఫ్టర్‌మార్కెట్ లిఫ్ట్ కిట్ మరియు పెద్ద మడ్-టెర్రైన్ టైర్‌లను కలిగి ఉంది.
మోడిఫైడ్ జిప్సీ పెద్ద స్నార్కెల్, సైడ్ స్టెప్స్‌గా పనిచేసే పెద్ద రాక్ స్లైడర్‌లు, గ్రేట్ అప్రోచ్ యాంగిల్స్, బుల్ బార్ మరియు భారీ LED లైట్ బార్ వంటివి బోల్డ్ లుక్‌కి జోడించి ఉన్నాయి. ప్రామాణిక హాలోజన్ హెడ్‌లైట్‌లు ఆఫ్టర్‌మార్కెట్ 7-అంగుళాల LED వృత్తాకార యూనిట్‌లతో ఉంటాయి.
ఈ జిప్సీ ఒక ప్రముఖ కింగ్ మోడల్. ఇందులో సాఫ్ట్-టాప్ మరియు 1.3-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఇవ్వబడింది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో నడుస్తుంది. పవర్ స్టీరింగ్ పంప్ మరియు AC కంప్రెసర్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ మోడిఫైడ్ జిప్సీ 2037 వరకు చెల్లుబాటు అయ్యే ఫిట్‌నెస్ సర్టిఫికేట్‌ను కలిగి ఉంది. 2022లో ఫిట్‌నెస్ సర్టిఫికేట్‌ను పొందినట్లు ఆ కార్ యజమాని పేర్కొన్నారు.
Also Read: iPhone 14 Pro Max Price: రూ. 20 వేలకే ఐఫోన్ 14 ప్రో మాక్స్.. బ్యాంక్, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ లేకుండానే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.