Ravi Teja - Eagle: రవితేజ `ఈగిల్` మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెల్స్.. హిట్ కొట్టాలంటే ఎంత రాబట్టలంటే..
Ravi Teja - Eagle Movie Pre Release Business Details: రవితేజ హీరోగా యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ `ఈగిల్`. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. మరికాసేట్లో విడుదల కానున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెల్స్ విషయానికొస్తే..
Ravi Teja - Eagle: మాస్ మహారాజ్ రవితేజ..లాస్ట్ ఇయర్ వాల్తేరు వీరయ్య, రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు సినిమాలతో పలకరించారు. అందులో మెగాస్టార్ తమ్ముడిగా నటించిన వాల్తేరు వీరయ్ బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. అయినా.. ఆ క్రెడిట్ మొత్తం చిరు ఖాతాలోకి వెళ్లింది. ప్రస్తుతం ఈయన ఈగిల్ మూవీతో పలకరించబోతున్నాడు. సంక్రాంతి రేసులో విడుదల కావాల్సిన ఈ మూవీ థియేటర్స్ తీవ్ర పోటీ కారణంగా ఫిబ్రవరి 9కి పోస్ట్ పోన్ అయింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. అయినా విడుదల విషయంలో ఒక అడుగు వెనకడుగు వేసినా.. ఈ సినిమాపై అంచనాలు ఏ మాత్రం తగ్గడటం లేదు.
ఇక సంక్రాంతి బరిలో మహేష్ బాబు 'గుంటూరు కారం', హనుమాన్ మూవీలు జనవరి 12న విడుదలయ్యాయి. ఇక జనవరి 13న ఈగిల్ మూవీ విడుదల కావాల్సి ఉన్న నిర్మాతల మండలి జోక్యంతో ఫిబ్రవరి 9కి రిలీజ్ డేట్‌ను పోస్ట్ పోన్ చేసుకుంది. ఇప్పటికే విడదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ ఏరియా వైజ్ థియేట్రికల్ బిజినెస్ విషయానికొస్తే..
తెలంగాణ (నైజాం).. రూ. 6 కోట్లు..
రాయలసీమ (సీడెడ్).. రూ. 2.5 కోట్లు..
ఆంధ్ర ప్రదేశ్.. రూ. 8.5 కోట్లు..
ఆంధ్ర ప్రదేశ్ + తెలంగాణ కలిపి .. రూ. 17 కోట్లు..
కర్ణాటక + రెస్ట్ ఆఫ్ భారత్ కలిపి రూ. 2 కోట్లు..
ఓవర్సీస్.. రూ. 2 కోట్లు..
ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ రూ. 21 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ మూవీ హిట్ అనిపించుకోవాలంటే .. బాక్సాఫీస్ దగ్గర రూ. 22 కోట్లు రాబడితే కానీ.. హిట్ అనిపించుకోదు. మరి ఈ మూవీకి వచ్చిన టాక్‌ను బట్టి ఈ మూవీ ఫలితం ఆధారపడి ఉంది.
ఈ మూవీలో హీరో రవితేజతో పాటు అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు.ఈ సినిమాను కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. దాంతో పాటు రచన, ఎడిటింగ్ వంటి బాధ్యతలు నిర్వహించారు. సంగీతం దావ్జాంద్ అందించారు. విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మించారు.రవితేజ సినిమాల విషయానికొస్తే.. క్రాక్ తర్వాత మరోసారి గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రకటన విడుదల చేసారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మిస్తోంది. అటు హరీష్ శంకర్ దర్శకత్వంలో హిందీ రీమేక్ 'రెయిడ్' మూవీ చేస్తున్నారు. ఈ మూవీకి 'మిస్టర్ బచ్చన్' అనే టైటిల్ ఖరారు చేసారు. గతంలో వీళ్ల కాంబినేషన్‌లో షాక్, మిరపకాయ్ సినిమాలు వచ్చాయి. ఇపుడు రాబోతున్న 'మిస్టర్ బచ్చన్' మూవీ పై భారీ అంచనాలే ఉన్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter