Ravi Teja New Movie: ఈ మధ్య మాస్ మహారాజా రవితేజ టైం ఏ మాత్రం బాగోవటం లేదు. వరుసగా ఒకదాని తర్వాత మరొక సినిమా డిజాస్టర్లుగా నిలుస్తున్నాయి. ఒక సినిమా సూపర్ హిట్ అయితే వరుసగా మూడు నాలుగు డిజాస్టర్ సినిమాలు రవితేజ ను వెంటాడుతున్నాయి. రాజా ది గ్రేట్ సినిమా బ్లాక్ బస్టర్ అయింది అనుకుంటున్న సమయంలో వరుసగా టచ్ చేసి చూడు, నేల టికెట్, అమర్ అక్బర్ ఆంటోనీ, డిస్కో రాజా వంటి నాలుగు డిజాస్టర్లు రవితేజను వెంటాడాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక ఈ మధ్యనే 2021 లో క్రాక్ సినిమా సూపర్ హిట్ అయింది అనుకుంటున్న సమయంలో ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా సినిమాలు రవితేజ కరీర్ లో మాయని మచ్చలుగా మిగిలిపోయాయి. వాల్తేరు వీరయ్య సినిమా తో మరొకసారి ఊపందుకున్న రవితేజ "రావణాసుర" పెద్దగా మెప్పించలేకపోయారు. త్వరలోనే రవితేజ హీరోగా నటించిన "టైగర్ నాగేశ్వరరావు" సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. 


మరి ఈ సినిమాతో అయినా రవితేజ కరియర్ మళ్ళీ ఒక గాడిలో పడుతుందా లేదా అనేది మాత్రం చూడాలి. బయోపిక్ గా ప్రేక్షక ముందుకు రాబోతున్న ఈ సినిమాలో రవితేజ ఒకప్పటి ప్రముఖ దొంగ టైగర్ నాగేశ్వరరావు పాత్ర లో కనిపించబోతున్నారు. ఇక ఈ సినిమా తర్వాత రవితేజ చేస్తున్న "ఈగల్" సినిమా కూడా ఒక స్పై థ్రిల్లర్ అని తెలుస్తోంది. ఈ సినిమా కి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు.


ఇక ఈ సినిమా తర్వాత కూడా రవితేజ చేతిలో కొన్ని మంచి సినిమాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ విషయాన్ని రవితేజ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తెలియజేశారు. 2024లో తను చేయబోతున్న సినిమాలలో ఒక సైన్స్ ఫిక్షన్ డ్రామా కూడా ఉంది అని తెలియజేశారు రవితేజ. 


అంతేకాకుండా కామెడీ జోనర్ లో ఒక సినిమా మరియు మాస్ ఎంటర్టైనర్ గా మరొక సినిమా కూడా రవితేజ చేతుల్లో ఉన్నాయట. ఇక పై తన సినిమాలు అన్నీ ఒకటే జోనర్ లో ఉండవు అని కచ్చితంగా చెబుతున్నారు రవితేజ. టిపికల్ సినిమాలు చేయటం మానేసి విభిన్న జోనర్లలో సినిమాలు చేస్తానని అభిమానులకి ప్రామిస్ కూడా చేశారు రవితేజ. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికైనా రవితేజ మళ్లీ వరుస సక్సెస్ లు అందుకోవాలని ఫాన్స్ ప్రార్ధనలు చేస్తున్నారు. మరి రవితేజ కెరీర్ విషయంలో ఫాన్స్ అసలు ఎంతవరకు నెరవేరుతాయో చూడాలి.


Also Read: Oppo Reno10 Pro+ 5G Price: బంఫర్‌ ఆఫర్‌ మీ కోసం..Oppo Reno10 Pro+ 5G మొబైల్‌ రూ. 17,549కే..నమ్మట్లేదా?  


Also Read: Bathukamma Festival Special: బతుకమ్మ పండుగ స్పెషల్.. ఈ పూలలో దాగిన ఔషధ గుణాలు ఎన్నో..!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి