మూవీ రివ్యూ: మత్తు వదలరా 2 (Mathu Vadalara 2)
నటీనటులు: శ్రీ సింహా కోడూరి, సత్య, సునీల్, వెన్నెల కిషోర్, ఫరియా అబ్దుల్లా, అజయ్, ఝాన్సీ, రాజా చెంబ్రోలు తదితరులు
ఎడిటర్:  కార్తీక్ శ్రీనివాస్
సినిమాటోగ్రాఫర్: సురేశ్ సారంగం  
మ్యూజిక్:కాల భైరవ
నిర్మాత: చెర్రీ (చిరంజీవి పెదమల్లు), హేమలతా పెదమల్లు  
దర్శకత్వం: రితేష్ రానా


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శ్రీ సింహా కోడూరి, సత్య ముఖ్యపాత్రల్లో రితేష్ రానా దర్శకత్వంతో తెరకెక్కిన మూవీ ‘మత్తు వదలరా’. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన ‘మత్తు వదలరా’ మూవీ ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ‘మత్తు వదలరా’ మూవీని మించి ఉందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..


కథ విషయానికొస్తే..


‘మత్తు వదలరా’మూవీకి లింకప్ చేస్తూ ‘మత్తు వదలరా 2’ కథ ప్రారంభమవుతోంది. బాబు మోహన్ (శ్రీ సింహా కోడూరి), యేసుదాసు (సత్య) జాబ్ లేని టైమ్ లో హైదరాబాద్ క్రైమ్స్ ను ఇన్వెష్టిగేషన్ కోసం HE (హెడ్ ఆఫ్ ఎమర్జన్సీ)లో ఏజెంట్స్ జాయిన్ అవుతారు. వీరి దగ్గరకు ఎక్కువగా కిడ్నాప్ వంటి సంక్లిష్టమైన కేసులే డీల్ చేస్తుంటారు. ఈ క్రమంలో రివకరీ చేసిన మనీలో కొత్త డబ్బు తస్కరిస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ టైమ్ లో వీళ్లిద్దరికి దగ్గరకు ఓ మిస్సింగ్ కేసు వస్తుంది. ఆ కిడ్నాప్ కేసుతో వీరి లైఫ్ అనుకోని టర్న్ తీసుకుంటుంది. ఈ  కిడ్నాప్ కేసుకు ఓ పబ్ లో స్లేవ్ డ్రగ్ అమ్మే ముఠాకు సంబంధం ఉంటుంది. అంతేకాదు ఈ క్రమంలో వీరిపై ఓ మర్డర్ కేసు మీద పడుతుంది. అసలు వీరిని మర్డర్ కేసులో ఎవరు ఇరికించారు. ఈ క్రమంలో ఏం జరిగిందనేదే ‘మత్తు వదలరా 2’ మూవీ స్టోరీ.


కథనం, టెక్నికల్ విషయానికొస్తే..


ఇలాంటి రెగ్యులర్ మర్డర్, క్రైమ్ స్టోరీలకు కథ మాములుగా ఉన్న దాన్ని ఎక్స్ క్యూట్ చేసిన విధానంపైనే సినిమా ఆడుతుంది. దర్శకుడు రితేష్ రానా గత  చిత్రం ‘మత్తు వదలరా’ మూవీకి లింకప్ చేస్తూ ‘మత్తు వదలరా 2’ స్టోరీని రాసుకోవడం బాగానే ఉంది. తెలుగులో ఇలాంటి తరహా కథలు బోలేడు వచ్చినా.. కొత్తగా ఎవరు ఎంత బాగా కథను  చెబితే ప్రేక్షకులు ఆదరిస్తారు. ఈ విషయంలో దర్శకుడు రితేష్ రానా సక్సెస్ అయ్యాడు. అంతేకాదు తాను చెప్పాలనుకున్న విషయాన్ని హిల్లేరియస్ గా చెప్పాడు. ముఖ్యంగా సత్య కామెడీ టైమింగ్ ను బాగానే వాడుకున్నాడు దర్శకుడు. అతనితో చిరు ‘లంకేశ్వరుడు’ డాన్స్ మూమెంట్స్ మాస్ ప్రేక్షకులతో ఈలలు తెప్పిస్తాయి.  అటు వెన్నెల కిషోర్, సునీల్ తో స్టడీ కామెడీని రాబట్టుకొన్నాడు. ప్రస్తుత సమాజంలో తమకు తెలియకుండానే డ్రగ్స్ ఉచ్చులో ఎలా చిక్కుకుంటున్నారు.


ఈ క్రమంలో వారికీ తెలియకుండానే లైంగిక కార్యక్రమాల్లో పాల్గొనే చేసి వారి బ్లాక్ మెయిల్ చేసే ఓ ముఠా. మొత్తంగా డ్రగ్స్ కు వ్యతిరేకంగా రితేష్ రానా తాను చెప్పాలనుకున్న పాయింట్ ను ఇంకాస్త ఎఫెక్టివ్ గా చెప్పివుంటే బాగుండేది. ఫస్ట్ హాఫ్ వరకు సినిమాను ఎంతో పకడ్బందీగా తెరకెక్కించి సెకాండఫ్ లో ఏమి జరుగబోతుందో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసాడు. హీరో, అతని ఫ్రెండ్ అనుకోకుండా తమకు సంబంధంలేని మర్డర్ కేసులో ఇరుక్కోవడం  దాన్ని ఛేదించే  క్రమంలో వెలుగులోకి ఎలాంటి విషయాలు బయటపడ్డాయనేది ఇంకాస్త గ్రిస్పింగ్ గా చెప్పి ఉంటే ఈ సినిమా వేరే లెవల్లో ఉండేది. చూసే ప్రేక్షకులకు  కూడా  హీరోను అతని ఫ్రెండ్ ను ఎవరు మర్డర్ కేసులో ఇరికించారనేది తెలిసిపోతుంది.ఈ సినిమాకు కాల భైరవ అందించిన సంగీతం పెద్ద ఎస్సెట్ గా నిలిచింది. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి.


నటీనటుల విషయానికొస్తే..
శ్రీ సింహా కోడూరి ఉన్నంత తన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో అసలు సిసలు హీరో ఎవరంటే సత్య అనే చెప్పాలి. తన  కామెడీ టైమింగ్ తో ఈ సినిమాను నిలబెట్టాడు. మరోవైపు వెన్నెల కిషోర్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. సునీల్ కూడా నవ్వించాడు. ఫరియా అబ్దుల్లా.. సినిమా మొత్తం తన క్లీవేజ్ చూపిస్తూనే తన యాక్టింగ్ మెప్పించింది. అజయ్, రోహిణి, రాజా చెంబ్రోలు సహా మిగిలిన నటీనటుల తమ పరిధి మేరకు రాణించారు.


పంచ్ లైన్.. ‘మత్తు వదలరా 2’.. ఇంకాస్త మత్తు వదిలిస్తే బాగుండేది..


ఇదీ చదవండి:  పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకోవడానికి కారణమేమిటంటే..!


ఇదీ చదవండి:  పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.