Nagababu on Niharika: మెగా డాటర్ నిహారిక కొద్దిరోజుల క్రితం తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను డిలీట్ చేసిన సంగతి తెలిసిందే. ఉన్నట్టుండి నిహారిక ఇన్‌స్టా ఖాతాను డిలీట్ చేయడంతో పలు రూమర్స్ తెర పైకి వచ్చాయి. సమ్‌థింగ్ ఏదో జరిగి ఉంటుందంటూ నెటిజన్లు దీనిపై చెవులు కొరుక్కుంటున్నారు. ఇప్పటివరకూ దీనిపై నిహారిక స్పందించకపోవడంతో.. ఈ వ్యవహారంపై పలు రూమర్స్ ప్రచారంలో ఉన్నాయి. తాజాగా మెగా బ్రదర్, నిహారిక తండ్రి నాగబాబు ఈ వ్యవహారంపై స్పందించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇన్‌స్టాలో నెటిజన్లతో చిట్‌చాట్ సందర్భంగా.. ఓ నెటిజన్ నిహారిక ఇన్‌స్టా ఖాతా గురించి నాగబాబుతో ప్రస్తావించాడు. నిహారిక ఎందుకని తన ఇన్‌స్టా ఖాతాను డిలీట్ చేసిందని ప్రశ్నించాడు. రూమర్స్‌పై స్పందించాలని కోరాడు. దీనిపై స్పందించిన నాగబాబు.. 'నిజానికి నేనే కోడింగ్ నేర్చుకుని నిహారిక ఇన్‌స్టా ఖాతాను డీయాక్టివేట్ చేశా. డీకోడింగ్ నేర్చుకోగానే మళ్లీ యాక్టివేట్ చేస్తా..' అంటూ నాగబాబు ఫన్నీ కామెంట్స్ చేశారు. మొత్తానికి విషయమేంటనేది మాత్రం నాగబాబు చెప్పలేదు.


నిహారిక తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను డిలీట్ చేసే ముందు.. ఓ వీడియోని పోస్ట్ చేసింది. అందులో తన జిమ్ ట్రైనర్ వీపుపై నిహారిక కూర్చోగా... సదరు ట్రైనర్ అలాగే పుష్ అప్స్ చేశాడు. ఆ సమయంలో నిహారిక గట్టిగా నవ్వుతూ, అరుస్తూ కనిపించింది. అయితే ఈ వీడియోపై నెటిజన్లు నిహారికను తప్పు పట్టారు. పెళ్లయ్యాక.. ఇలాంటి పనులేంటని మండిపడ్డారు. ఇదే విషయంపై నిహారిక అత్త, మామ కూడా ఆగ్రహం వ్యక్తం చేయంతో ఆమె తన ఇన్‌స్టా ఖాతాను డిలీట్ చేసినట్లు రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికైతే నిహారిక నుంచి దీనిపై ఎటువంటి రెస్పాన్స్ లేదు.  



Also Read: Jagga Reddy on Revanth Reddy: నా పంచాయితీ అంతా రేవంత్ రెడ్డితోనే.. టైమ్ వచ్చినప్పుడు ఝలక్ ఇస్తా... 


Also Read: LPG Cylinder Price: వంటగ్యాస్‌పై భారీ వడ్డింపు.. ఆల్ టైమ్ హై! తెలంగాణ‌లో గ్యాస్‌ సిలిండర్‌ ధర ఎంతో తెలుసా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook