Naga babu Getup Srinu వెండితెరపై సినిమాలు తీసి చేతులు కాల్చుకున్న నాగబాబుకు మళ్లీ ఊపిరి పోసింది బుల్లితెర. అందులోనూ జబర్దస్త్ షో నాగబాబుకు సెకండ్ ఇన్నింగ్స్‌లా మారింది. జబర్దస్త్ జడ్జ్‌గా నాగబాబుకు ఫుల్ క్రేజ్ వచ్చింది. జబర్దస్త్ ప్రారంభం నుంచి నాగబాబు ఉన్నాడు. మధ్యలో వెళ్లిపోయాడు. ఆ వెళ్లిపోయే సమయంలోనూ ఎన్నో కాంట్రవర్సీలు వచ్చాయి. నితిన్, భరత్‌ల కోసం నాగబాబు బయటకు వచ్చేసిన సంగతి తెలిసిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నాగబాబు బయటకు వెళ్తుండటంతో.. ఆయన భక్తులైన సుధీర్, గెటప్ శ్రీను, ఆది వంటి మెయిన్ వికెట్లు పడతాయని అంతా భావించారు. కానీ అది కుదర్లేదు. సుధీర్, గెటప్ శ్రీను, ఆది ఇలా అందరూ కూడా జబర్దస్త్ షోలోనే ఉండిపోయారు. నాగబాబుతో కొంత మంది మాత్రం బయటకు వచ్చారు. కొన్ని రోజులు అదిరింది, బొమ్మ అదిరింది అంటూ కానిచ్చారు. ఆ తరువాత నాగబాబు చేతులెత్తేశాడు. వారంతా కూడా కామెడీ స్టార్స్ షోలో సెట్ అయ్యారు.


 



మధ్యలో నాగబాబు బుల్లితెరకు దూరంగా ఉంటూ వచ్చాడు. ఇప్పుడు మళ్లీ కామెడీ స్టార్స్ షోకు వచ్చాడు. శేఖర్ మాస్టర్, నాగబాబు కలిసి ఆ షోను హోస్ట్ చేస్తున్నారు. అయితే ఇంత కాలం గడిచినా సుధీర్, గెటప్ శ్రీను, ఆదిలు మాత్రం నాగబాబుతో అదే రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారు.


తాజాగా నాగబాబు తన ప్రియ శిష్యుడు గెటప్ శ్రీనుకు స్పెషల్‌గా విషెస్ చెప్పాడు. చెబుతూ నాటి జబర్దస్త్ రోజుల్లో దిగిన ఫోటోను షేర్ చేశాడు. నేను కలిసి వారందరిలోకెల్లా ఎంతో మంచి వ్యక్తి.. నిన్ను ఈ స్థాయిలో చూస్తుంటే నాకు ఎంతో గర్వంగా ఉంది.. పుట్టిన రోజు శుభాకాంక్షలు అని గెటప్ శ్రీను గురించి స్పెషల్ పోస్ట్ వేశాడు.


Also Read : Unstoppable With NBK : ప్రభాస్‌ను అలా పిలిచిన బాలయ్య.. ఎపిసోడ్ అంతా అంతేనట


Also Read : Upasana Konidela Pregnancy : తండ్రి కాబోతోన్న రామ్ చరణ్‌.. గుడ్ న్యూస్ చెప్పిన మెగాస్టార్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook