Ram Charan - Upasana: ఫోర్బ్స్ మ్యాగజైన్ కవర్ పేజీపై మెగా జంట.. టాలీవుడ్ ఫస్ట్ కపుల్‌గా ఘనత..
Ram Charan - Upasana: రామ్ చరణ్ దంపతులు మరో రేర్ ఫీట్ ను అందుకున్నారు. ఏ టాలీవుడ్ కపుల్ కు సాధ్యంకాని ఘనతను వారు సాధించారు. ఫోర్బ్స్ మ్యాగజైన్ కవర్ పేజీపై దర్శనమిచ్చిన టాలీవుడ్ తొలి జంటగా ఈ మెగా కపుల్ నిలిచారు.
Ram Charan and Upasana Shine on Forbes Cover: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దంపతులు మరో అరుదైన ఘనతను సాధించారు. తాజాగా ఈ కపుల్ ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ మ్యాగజైన్ కవర్ పేజీపై దర్శనమిచ్చారు. అయితే ఇప్పటి వరకు ఏ టాలీవుడ్ జంట ఇలా ఫోర్బ్స్ మ్యాగజైన్ కవర్ పేజీపై కనిపించింది లేదు. ఈ గౌరవాన్ని పొందిన మెుదట జంట వీరిదే. కవర్ పేజీపై చరణ్, ఉపాసన పింక్ కలర్ డిజైనర్ డ్రెసుల్లో చాలా స్టైలీష్ గా కనిపించారు. అంతేకాకుండా రామ్ చరణ్ దంపతులు తమ లవ్ స్టోరీ, వైవాహిక జీవితం, క్లీంకార వారి జీవితంలోకి వచ్చాక ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయనేది ఫోర్బ్స్ మ్యాగజైన్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. దీనికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ మెగా ఫ్యాన్స్ సంబంరాలు చేసుకుంటున్నారు.
మహారాష్ట్ర సీఎంను కలిసిన చరణ్ దంపతులు
ఇదిలా ఉండగా.. రామచరణ్ దంపతులు శుక్రవారం(డిసెంబరు 22)న మహారాష్ట్ర సీఎం ఏక్‍నాథ్ షిండేను కలిశారు. ముంబైలోని సీఎం కార్యాలయానికి వెళ్లిన చరణ్, ఉపాసనలకు సాదర స్వాగతం పలికారు సీఎం కుటుంబ సభ్యులు. ముఖ్యమంత్రి షిండే కోడలు వృశాలీ హారతి ఇచ్చి రామ్‍చరణ్, ఉపాసనకు స్వాగతం పలికారు. అనంతరం షిండే, వారి కుమారుడు శ్రీకాంత్ లతో ముచ్చటించారు చరణ్ దంపతులు. బ్లూ డెనిమ్ షర్ట్, బ్లాక్ ప్యాంట్‍ను రామ్‍చరణ్ ధరించగా.. ఉపాసన ఫ్లోరల్ కుర్తీ వేసుకున్నారు. అయితే వారి వెంట కూతురు క్లీంకారను తీసుకురాలేదు.తాజాగా దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వారం రోజులగా ముంబైలో గడుపుతున్నారు ఈ మెగా కపుల్. తమ కూతురు క్లీంకారకు ఆరు నెలలు పూర్తయిన సందర్భంగా ముంబైలోని మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు.
Also Read: Salaar: సలార్ చిత్రం మిస్ చేసుకున్న హీరోయిన్... ఫైనల్ గా ఛాన్స్ కొట్టేసిన శృతిహాసన్
ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం రామ్ చరణ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ నిర్మాణ దశలో ఉంది. ఇందులో చరణ్ కు జోడిగా కియారా అడ్వానీ నటిస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. మరోవైపు చరణ్ బుచ్చిబాబు సనాతో కూడా ఓ సినిమా చేస్తున్నాడు. ఇది స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రాబోతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook