Mega family emotional video: ఆంధ్రప్రదేశ్ లో జూన్ 9న చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈరోజు వచ్చిన ఎన్నికల ఫలితాలలో.. టిడిపి విజయ జండా ఎగరవేసింది. టిడిపి దెబ్బకు వైసీపీ కాస్త చటికెలపడింది. కానీ ఇక్కడ టిడిపి గెలుపుకి.. వైసీపీ ఓతమికి.. రెండిటికి పవన్ కళ్యాణ్ కారణము అంటున్నారు ఆయన అభిమానులు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ చంద్రబాబు నాయుడు టిడిపి పార్టీతో కలిసి ఈ ఎన్నికలలో పాల్గొన్న సంగతి తెలిసిందే. టిడిపి, జేఎస్పీ, బీజేపీ కలిసి కూటమిగా పోటీ చెయ్యడం వల్లే వైసీపీ పైన విజయం సాధించగలిగారు అనేది ఎంతో మంది అభిప్రాయం. ఇందులో క్రెడిట్ ఎక్కువగా పవన్ అభిమానులు.. తమ పవర్ స్టార్ ఖాతాలోనే వేసుకుంటున్నారు.


పిఠాపురం నియోజకవర్గంలో పవన్ సునామీకి వైసీపీ కొట్టుకుపోయింది అంటూ సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెట్టేస్తున్నారు. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. తన సమీప వైసీపీ అభ్యర్ధి వంగా గీతపై గతంలో ఎన్నడూ లేనంత విధంగా.. 70,354 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. దీంతో ఈ గెలుపుని పవన్ అభిమానులు ఓ రేంజ్ లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ గెలిచిన విషయాన్ని తెలుసుకుని ఆయన కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. 


కాగా, కుటుంబ సభ్యులు, జనసైనికులతో కలిసి పిఠాపురంలో.. పవన్ కళ్యాణ్ అన్నయ్య నాగబాబు ఎన్నికల ఫలితాలను పర్యవేక్షిస్తున్నారు. ఇక టీవీ స్క్రీన్‌పై పవన్ కళ్యాణ్ విజయాన్ని చూసి.. ఆయన సోదరి కాస్త చాలా ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక పవన్ విజయంతో జనసైనికులు సంబరాల్లో మునిగిపోయారు.


 



 


Read more; Prewedding shoot: ప్రీవెడ్డింగ్ షూట్ లో తాత హల్ చల్.. కొత్త జంటకు ట్విస్ట్ మాములుగా లేదుగా.. వీడియో వైరల్..


Read more: Snakes Video: బాప్ రే.. కింగ్ కోబ్రాకు షాంపుతో స్నానం... వీడియో వైరల్..



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి