Sai Dharam Tej Marriage : నీ పెళ్లి ఎప్పుడు బ్రో.. నెటిజన్ ప్రశ్న.. సాయి ధరమ్ తేజ్ ఫన్నీ రిప్లై
Sai Dharam Tej Chit Chat సాయి ధరమ్ తేజ్ తాజాగా తన అభిమానులతో చిట్ చాట్ చేశాడు. అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. అయితే సాయి ధరమ్ తేజ్ పెళ్లి మీద రకరకాల ప్రశ్నలు సంధించారు. అయితే ఇప్పుడు వాటికి తేజు చెప్పిన రిప్లై వైరల్ అవుతోంది.
Sai Dharam Tej Marriage మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం ఫుల్ ఫాంలోకి వచ్చాడు. విరూపాక్ష సినిమాతో ఈ సుప్రీమ్ హీరో హిట్ కొట్టేశాడు. విరూపాక్ష సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో చిరంజీవి, రామ్ చరణ్, నాగబాబు, పవన్ కళ్యాణ్ ఇలా అంతా కూడా సంతోషాన్ని వ్యక్తం చేశారు. విరూపాక్ష బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో మెగా ఫ్యామిలీ అంతా సంబరాలు కూడా చేసుకుంది. ఇక తాజాగా తేజు అయితే తన సంతోషాన్ని తన అభిమానులతో పంచుకునేందుకు ట్విట్టర్‌లో యాక్టివ్ అయ్యాడు.
#ASKSDT అనే పేరు చిట్ చాట్ చేశాడు. అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. విరూపాక్ష సినిమాకు సీక్వెల్ ఉంటుందని, రెండో పార్ట్ ఉంటుందని హింట్ ఇచ్చారు నిజంగానే రెండో పార్ట్ ఉంటుందా? అని ఓ అభిమాని అడిగితే.. రెండో పార్ట్ ఉంటుందనే కదా? హింట్ ఇచ్చేది అని చెప్పుకొచ్చాడు. ఇక మరో అభిమాని అయితే క్లైమాక్స్‌లో హీరో కళ్లు బ్లూగా మారడంతో నెక్ట్స్ పార్ట్‌లో నువ్ దెయ్యంలా మారుతావా? అపరిచితుడిలా మారుతావా? అని అడిగితే.. చంద్రముఖి వీడియోను షేర్ చేసి నవ్వించాడు తేజు.
చాలా మంది అయితే తమకు రిప్లై ఇవ్వడం లేదని అలిగిపోయారు. కోపం వస్తుందని ఎమోషనల్ అయ్యారు. వారందరికీ కూడా ఫన్నీగా సమాధానం ఇచ్చాడు సాయి ధరమ్ తేజ్. నవ్విస్తూ జిఫ్ ఫైల్స్‌ను షేర్ చేశాడు. అయితే ఇందులో కొంత మంది ఇలా కూడా అడిగారు. మెగా హీరోల్లో కాకుండా ఈ తరంలో నీకు నచ్చిన హీరోలు ఎవరో నిజాయితీగా చెప్పు అని అన్నారు. దీంతో తనకు రవితేజ, ప్రభాస్ అంటే ఇష్టమని చెప్పేశాడు.
మరి కొందరు సాయి ధరమ్ తేజ్ పెళ్లి గురించి ప్రశ్నించారు. నీ పెళ్లి ఎప్పుడు బ్రో అని ఓ నెటిజన్ అడిగితే.. నీకు అయిన తరువాత.. సో నీ పెళ్లి ఎప్పుడు? అని తిరిగి ప్రశ్నించాడు తేజు. మరో నెటిజన్ అసలు నీ పెళ్లి ఎలా జరుగుతుంది? లవ్ మ్యారేజా? అరెంజ్డ్ మ్యారేజా? అని అడిగాడు. ఇన్ని ఆప్షన్స్ కూడా ఉంటాయా? అని తేజు ఆశ్చర్యపోయాడు.
Also Read: Virupaksha Collections : బ్రేక్ ఈవెన్‌కు దగ్గర్లో విరూపాక్ష.. దుమ్ములేపేస్తోన్న మెగా హీరో
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook