Ram Charan on Bheemla Nayak Trailer: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), రానా దగ్గుబాటి కలసి నటించిన చిత్రం 'భీమ్లా నాయక్' (Bheemla Nayak). సాగర్ చంద్ర దర్శకుడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కి జోడిగా నిత్యామీనన్, రానా సరసన సంయుక్త మీనన్ నటిస్తున్నారు. మురళీశర్మ, రావు రమేష్, సముద్ర ఖని తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.  ఫిబ్రవరి 21న రిలీజ్ అయిన ఈ చిత్ర ట్రైలర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఇద్దరు హీరోల మధ్య ట్రైలర్ లో వచ్చే పవర్ పుల్ పంచ్ లు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా ఈ చిత్ర ట్రైలర్ పై స్పందించారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan). ''భీమ్లానాయక్ ట్రైలర్ ఎలెక్ట్రిఫయింగ్ ! పవన్ కళ్యాణ్ గారి ప్రతి డైలాగ్, యాక్షన్ పవర్ ఫుల్ గా ఉంది. నా ఫ్రెండ్ రానా (Rana) పర్ఫార్మెన్స్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతం. చిత్రయూనిట్ కి ఆల్ ది బెస్ట్'' అంటూ రామ్ చరణ్ ట్వీట్ చేశారు. 



సూర్యదేవర నాగ వంశీ నిర్మించిన “భీమ్లా నాయక్” చిత్రం మలయాళ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’కు రీమేక్ గా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి తమన్ (Thaman) సంగీతమందించారు. బుధవారం సాయంత్రం భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్  ఈవెంట్ జరగనుంది. ఈ వేడుకకు తెలంగాణ మంత్రి కేటీఆర్ (KTR) చీఫ్ గెస్ట్ గా హాజరవుతుండడం విశేషం. ‘భీమ్లా నాయక్’ ఫిబ్రవరి 25న థియేటర్లలో సందడి చేయనుంది. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook