Tension For Megastar Chiranjeevi Fans: వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తో మంచి జోష్ మీద ఉన్న చిరంజీవి అలాంటి వింటేజ్ సబ్జెక్టులతో మరిన్ని హిట్లు కొట్టాలని చూస్తున్నాడు. ప్రస్తుతానికి చిరంజీవి వీలైనంత త్వరగా భోళా శంకర్ సినిమా షూటింగ్ పూర్తి చేసి దాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాడు. భోళా శంకర్ సినిమా స్క్రిప్ట్ కి అనేక మార్పులు, చేర్పులు చేయడం తెలుగు వారికి నచ్చే విధంగా చాలా ట్రీట్మెంట్ ఇవ్వడంతో కచ్చితంగా ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందని చిరంజీవి నమ్ముతున్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 వాల్తేరు వీరయ్య సూపర్ హిట్ తర్వాత భోళా శంకర్ టీం మీద మెగాస్టార్ చిరంజీవి ఒత్తిడి తీసుకురావడంతో చాలా వరకు మార్పులు చేర్పులు తీసుకొచ్చారు. తాను చెప్పినట్లు చేస్తే కచ్చితంగా సినిమా హిట్ అవుతుందని చిరంజీవి బలంగా చెబుతున్న నేపథ్యంలో దాదాపు సినిమా యూనిట్ అంతా ఆయన చెప్పిన విధంగానే సినిమాకి అనేక హంగులు అద్దారు. ఇక తాజాగా మెగాస్టార్ చిరంజీవి అభిమానులను కలవర పెట్టే విధంగా పలు వార్తలు బయటకు వస్తున్నాయి. వాస్తవానికి భోళా శంకర్ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వెంకీ కుడుముల దర్శకత్వంలో ఒక సినిమా చేస్తాడని అనుకున్నారు.


Also Read: Shaakuntalam vs Dasara: దారుణంగా 'శాకుంతలం'.. నాని సినిమా 20వ రోజు కలెక్షన్స్ క్రాస్ చేయలేక పోయిందిగా!
ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రావడంతో దాదాపు ఆ సినిమా పట్టాలెక్కుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఆ సినిమా ఇప్పట్లో పట్టాలెక్కే అవకాశాలు కనిపించడం లేదు. వెంకీ కుడుముల నితిన్ తో మరో సినిమా ప్రారంభించిన నేపథ్యంలో ఇప్పట్లో మెగాస్టార్ చిరంజీవి సినిమా ఉండటం కష్టమే. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి కళ్యాణ్ కృష్ణ చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తదుపరి సినిమా ఆయనతోనే ఉండబోతుందని ఒక ప్రచారం సాగుతోంది.


కాదు బింబిసార డైరెక్టర్ వేణు మరో కథ చెప్పాడని, దానికి మెగాస్టార్ చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కూడా మరోపక్క ప్రచారం జరుగుతుంది. అయితే అటు కళ్యాణ్ కృష్ణతో పాటు ఇటు వేణు కూడా అద్భుతమైన దర్శకులేమీ కాదు. అయితే అదృష్టం కొద్దీ ఇద్దరి ఖాతాల్లోనూ హిట్ సినిమాలు ఉన్నాయి. అయినా సరే మెగా అభిమానులు మాత్రం ఈ విషయంలో కొంత కలవరపడుతున్నారు. కానీ మెగా కాంపౌండ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు మెగాస్టార్ ఇప్పటికీ కథలు విని డెవలప్ చేస్తే బాగుంటాయని మాత్రమే కొందరు దర్శకులకు చెప్పారట.


వారిలో బివిఎస్ రవి, బింబిసార డైరెక్టర్ మల్లిడి వేణు చెప్పిన కథలతో పాటు బెజవాడ ప్రసన్న కుమార్ చెప్పిన కథ కూడా ఉందని తెలుస్తోంది. కళ్యాణ కృష్ణ చెప్పిన రెండు కథలు బాగున్నాయి అని కాకపోతే వాటిని ఇంకా డెవలప్ చేయాలని వారికి సూచించారట. అంటే వీరు డెవలప్ చేసి మెగాస్టార్ చిరంజీవి దగ్గరికి మరోసారి తీసుకువెళ్తే ఆయన సినిమా చేస్తారా లేదా అనే విషయం మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మెగా అభిమానులు ఇప్పటినుంచి ఈ విషయంలో టెన్షన్ పడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు మెగా కాంపౌండ్ వర్గాల వారు. చూడాలి మరి భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది.


Also Read: Samantha vs Lawrence: డిజాస్టర్ దిశగా 'శాకుంతలం'.. షాకిస్తూ దూసుకుపోతున్న రుద్రుడు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook