Happy Birthday Allu Arjun: టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు నేడు(ఏప్రిల్ 8). నేడు మెగా హీరో అల్లు అర్జున్ బర్త్‌డేను పురస్కరించుకుని టాలీవుడ్ సెలబ్రిటీలు బన్నీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే బర్త్‌డే కానుకగా నిన్న విడుదలైన ‘పుష్ప’ టీజర్‌తో బన్నీ బర్త్‌డే సంబరాలు ఒకరోజు ముందుగానే మొదలయ్యాయి. పుష్పరాజ్‌గా తెరపై సందడి చేయనున్న అల్లు అర్జున్ ఊర మాస్ లుక్‌లో కనిపించాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మెగాస్టార్ చిరంజీవి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు తనదైన శైలిలో ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పుష్పరాజ్‌గా అల్లు అర్జున్ తగ్గేదేలే, హ్యాపీ బర్త్‌డే మై డియర్ బన్నీ అని అల్లు అర్జున్(HBD Allu Arjun)‌కు పుట్టినరోజు విషెస్ తెలిపారు. తాను పుష్ప టీజర్ చూశానని, చాలా రియలిస్టిక్‌గా రస్టిక్‌గా ఉందని మెగాస్టార్ చిరు కితాబిచ్చారు. టాలీవుడ్ ప్రముఖులతో పాటు బన్నీ ఫ్యాన్స్ సైతం బర్త్‌డే ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు.



Also Read: NTR’s Evaru meelo Koteeswarulu show: ఎవరు మీలో కోటీశ్వరులు వెనక్కి వెళ్లిందా ?


‘ఐకాన్ స్టార్ బన్నీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. పుష్పరాజ్ వీడియో చాలా బాగుంది. మీరు మరిన్ని బ్లాక్ బస్టర్ విజయాలు సాధించాలని ఆశిస్తున్నానని’ టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని ట్వీట్ చేశారు. 



‘హ్యాపీ బర్త్‌డే అల్లు అర్జున్. నీకు ఎప్పుడూ లక్ ఉండాలి. విజయం నోతోడై ఉండాలని కోరుకుంటున్నాను. పుష్ప టీజర్ చాలా బాగుంది. మూవీ కోసం ఎదురుచూస్తున్నాను’ అని మాస్ మహరాజా రవితేజ శుభాకాంక్షలు తెలిపారు.


‘పుష్పరాజ్‌ అల్లు అర్జున్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. స్క్రీన్ మీద మీ ఫైర్ సూపర్’ అని బన్నీకి పుష్ప హీరోయిన్ రష్మిక మందన్న బర్త్‌డే విషెస్ తెలిపింది. 


Also Read: Vakeel Saab Songs: ఒక్క క్లిక్‌తో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సాంగ్స్ జూక్ బాక్స్



‘హ్యాపీ బర్త్‌డే బగ్సీ. ఈ రోజు, ఈ సంవత్సరం మొత్తం నీకు అద్భుతంగా గడవాలని ఆకాంక్షిస్తూ’ నటి కాజల్ అగర్వాల్ ట్వీట్ చేసింది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook