Acharya Bhale Bhale Bhanjara Promo: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), కొరటాల శివ కాంబోలో వస్తున్న చిత్రం 'ఆచార్య' (Acharya). ఈ సినిమా నుంచి 'భలే భలే బంజారా' అనే గీతం ఏప్రిల్ 18న రిలీజ్ కానుంది. ఇప్పటికే చిరంజీవి, రామ్ చరణ్​ సంభాషణతో కూడిన టీజర్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. తాజాగా ఈ పాటకు సంబంధించిన ప్రోమో వీడియోను పంచుకుంది చిత్రబృందం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'సిరుత పులుల సిందాట' అంటూ సాగే 'భలే భలే బంజారా' సాంగ్ ప్రోమోలో (Bhale Bhale Banjara Song Promo) చిరంజీవి, రామ్​చరణ్​ స్టెప్పులతో ఇరగదీశారు. ఈ ప్రోమో వీడియోను చిత్ర నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొ కంపెనీ సోషల్ మీడియాలో షేర్​ చేసింది. పూర్తి సాంగ్ ను సోమవారం సాయంత్రం 4.05 గంటలకు విడుదల చేస్తామని తెలిపింది. 'భలే భలే బంజారా' సాంగ్ ను రామజోగయ్యశాస్త్రి రాయగా.. మణిశర్మ (Mani Sharma) బాణీలు అందించారు. 


'ఆచార్య' సినిమా ఈ నెల 29న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ నెల 23న సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు మేకర్స్. తొలుత ఈ వేడుక విజయవాడలో జరుగుతుందని ప్రచారం జరిగింది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈవెంట్ వేదికను హైదరాబాద్ కు మార్చినట్లు తెలుస్తోంది. ఈ వేడుకకు ఏపీ సీఎం జగన్ (AP CM jagan) ముఖ్య అతిథిగా వస్తారని ప్రచారం జరుగుతోంది.



Also Read: Chiranjeevi Acharya: ఆచార్య ప్రీ-రిలీజ్ ఈవెంట్ వేడుక విషయంలో ట్విస్ట్... మారిన వేదిక..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook