Chiranjeevi Acharya: ఆచార్య ప్రీ-రిలీజ్ ఈవెంట్ వేడుక విషయంలో ట్విస్ట్... మారిన వేదిక..!
Chiranjeevi Acharya Pre-Release Event: `ఆచార్య` ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను విజయవాడ వేదికగా నిర్వహించాలని తొలుత భావించిన మేకర్స్... అనుకోని కారణాలతో వేదికను మార్చారు.
Chiranjeevi Acharya Pre-Release Event: మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆచార్య' సినిమా ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ నెల 23న సినిమా ప్రీ-రిలీజ్ వేడుక నిర్వహించాలని మేకర్స్ నిర్ణయించారు. విజయవాడలో ఈ ఈవెంట్ జరుగుతుందని తొలుత ప్రచారం జరిగింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఆచార్య ప్రీ-రిలీజ్ ఈవెంట్ వేదిక మారింది. ఈ ఈవెంట్‌ను విజయవాడకు బదులు హైదరాబాద్‌లో నిర్వహించాలని మేకర్స్ నిర్ణయించారు.
అనివార్య కారణాలతో ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికను విజయవాడ నుంచి హైదరాబాద్‌కు మార్చినట్లు తెలుస్తోంది. ఈవెంట్ వేదిక మారిన నేపథ్యంలో ముఖ్య అతిథి ఎవరనే దానిపై సస్పెన్స్ నెలకొంది. ఈవెంట్‌ను విజయవాడలో నిర్వహిస్తే ముఖ్య అతిథిగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి హాజరవుతారని ప్రచారం జరిగింది. అనుకోని కారణాలతో వేదిక మారిన నేపథ్యంలో హైదరాబాద్‌లో జరిగే ఆచార్య ఈవెంట్‌కు జగన్ హాజరవుతారా లేక మరెవరినైనా ముఖ్య అతిథిగా పిలుస్తారా అన్నది తెలియాల్సి ఉంది.
ఆచార్య సినిమాకు సంబంధించి ఇప్పటివరకూ విడుదలైన పాటలు, ట్రైలర్, ఇతర ప్రచార చిత్రాలను బట్టి... సినిమా దేవాలయాల నేపథ్యంలో సాగేలా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను కనకదుర్గ కొలువైన విజయవాడలో నిర్వహించాలని మేకర్స్ నిర్ణయించినట్లుగా ఊహాగానాలు వినిపించాయి. అయితే చివరి నిమిషంలో వేదికను మార్చాలని మేకర్స్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
కాగా, కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్‌మెంట్స్ బ్యానర్స్ సంయుక్తంగా 'ఆచార్య' సినిమాను నిర్మించాయి. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు రాంచరణ్ ముఖ్య పాత్రలో కనిపిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. సినిమా విడుదల కోసం మెగా ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
Also Read: Petrol Diesel prices: పెరిగిన ధరల దెబ్బకు.. తగ్గిన పెట్రోల్, డీజిల్ వినియోగం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook